సోషల్ మీడియాలో అనసూయ బికినీ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. అయితే, ఇది ఎంత వరకు సమంజసం..
అనసూయ.. పరిచయం అక్కర్లేని తెలుగు అందం. ఉమెన్ విత్ గోల్డెన్ లెగ్ అని చెప్పటంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. సినిమాలు కావచ్చు.. టీవీ షోలు కావచ్చు.. ఆమె పని చేసిన వాటిలో సక్సెస్ రేటు 90 శాతం ఉంది. న్యూస్ రీడర్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె తన అందం, అభినయంతో అంచెలంచెలుగా ఎదిగారు. జబర్థస్త్ షోతో యాంకర్‌గా టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. ఆమె యాంకర్‌గా చేసిన ‘జబర్థస్త్’ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా టాప్ పొజిషన్‌లోకి చేరుకున్న ఆమె తర్వాతి కాలంలో నటనవైపు వచ్చారు. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ననాయన’ సినిమాలో ఓ పాత్రతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినా.. ప్రేక్షకుల గుర్తుండిపోయేలా ఆకట్టుకున్నారు.
ఇక, అదే సంవత్సరం విడుదలైన ‘క్షణం’ ఆమె నటనలోని ఇంకో కోణాన్ని బయటపెట్టింది. తలలు పండిన విలన్లకు సైతం ఏమాత్రం తీసిపోని నటనతో విలనిజాన్ని అద్భుతంగా పండించారు. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించారు. రెండేళ్ల తర్వాత 2018లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా అనసూయను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రంగమ్మత్తగా అందరికీ గుర్తుండిపోయే పాత్ర చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక అప్పటినుంచి అనసూయను ముద్దుగా రంగమ్మత్తగా పిలుచుకోవటం మొదలుపెట్టారు. విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్‌తో తాను ఏ విషయంలోనూ ‘తగ్గేది లే’ అని చెప్పకనే చెప్పారు. అయితే, అందం, టాలెంట్ ఉన్నా అవకాశాల్ని అందిపుచ్చుకోవటంలో అనసూయ కాస్త వెనుకబడ్డారు.
ఇది నిజానికి ఆమె తప్పుకాదు.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఉన్నా.. అద్భుతంగా నటిస్తున్నా తెలుగు మేకర్స్‌కు ఆమె కనబడ్డంలేదు. ఈ నేపథ్యంలోనే తాను అందం విషయంలోనూ.. అభినయం విషయంలోనూ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చెప్పటానికే బికినీ షో మొదలుపెట్టారని చెప్పొచ్చు. దీన్ని నెటిజన్లు తప్పు బట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. స్టార్ హీరోయిన్లు చేసినపుడు తప్పుగా కనబడనిది.. అనసూయ చేస్తే ఎందుకు కనిపిస్తోంది. ఆమె ఉన్నది గ్లామర్ ఫీల్డులో కాబట్టి..బికినీతో కనిపించటం అన్నది సర్వ సాధారణ విషయం. ఈ బికినీ షోలో ఓ వైపు ఆమె అందం కనబడుతూ ఉన్నా.. మరో వైపు మేకర్స్‌కు ఇన్‌డైరెక్ట్ మెసేజ్ కూడా ఉంది. అందం, టాలెంట్ ఉన్న అనసూయకు అవకాశాలు ఇవ్వటం విషయంలో తెలుగు మేకర్స్ కచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.