ఫిల్మ్ డెస్క్- అనన్య పాండే.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దు గుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. అనన్య సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలో తన అందాల విందు చేస్తుంటుంది. అందుకే అభిమానులను ఈమెను బాగా ఫాలో అయిపోతారు.
ఇదిగో తాజాగా ఈ యంగ్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెడ్ కలర్ బ్రాతో వయ్యారంగా ఓ రిస్టారెంట్ లో కూర్చున్న పిక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చేతిలో ఫ్రెంచ్ ఫైర్స్ పట్టుకొని, మరో చేతితో దాన్ని నోట్లో పెట్టుకుంటూ క్యూట్ స్మైల్ ఇచ్చింది అనన్య పాండే. ఇక రెడ్ కలర్ బ్రాలో అనన్య అందాల విందు మామూగా లేదు.
హాట్ హాట్ గా ఉన్న అనన్య పిక్‌ను ఆమె అభిమానులే కాదు, నెటిజన్స్ సైతం తెగ షేర్ చేసుకుంటున్నారట. అన్నట్లు అనన్య త్వరలో లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తోంది ఈ సినిమా.
ఈ మూవీలో విజయ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. లైగర్ సినిమాకు పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మాతలు. మొత్తం 5 భాషలలో లైగర్ పాన్ ఇండియన్ సినిమాగా రాబోతోంది.