సినిమా.. పైకి రంగురంగులుగా కనిపించే ఓ మాయా ప్రపంచం. ఇక్కడ బంధాలన్నీ తాత్కాలికమే. అవసరం తీరిపోయాక పట్టించుకునే వాళ్ళు ఉండరు. స్టార్ హీరోయిన్స్ గా దశాబ్దం పాటు పోటాపోటీగా నటించిన హీరోయిన్స్ మధ్య స్నేహం చిగురించడం దాదాపు అసాధ్యమే. అయితే.. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఆమని, ఇంద్రజ మాత్రం అలా కాదు. ఇప్పటికీ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలసి తాజాగా అలీ సరదాగా పోగ్రామ్ కి గెస్ట్ లుగా విచ్చేశారు. ఇందుకు సంబంధిచిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.
ఈ ప్రోమోలో ఆమని, ఇంద్రజ తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన చాలా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అమ్మ దొంగ సినిమాలో తామిద్దరం కలసి సౌందర్యతో యాక్ట్ చేశామని, కానీ.., మాలో మాకు పోటీ మాత్రం ఉండేదని ఇంద్రజ చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ఆమని తన కుటుంబ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేయుకుంది. ఇక ఇంద్రజని అలీ పాట పాడమని కోరగా.., ఆమె “శుభలగ్నం” మూవీలో నుండి “చిలక ఏ తోడు లేక” అనే పాటని అద్భుతంగా పాడింది. దీంతో.., ఎమోషనల్ అయిపోయిన ఆమని తన స్నేహితురాలిని ఆప్యాయంగా ముద్దాడింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. మరి.. వీరిద్దరి ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.