టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పండీ అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు సురేఖా వాణి. ఇప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తాజాాగా ఆమె చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
టాలీవుడ్లో టాలెంటెడ్ నటులకు కొదవలేదు. హీరో హీరోయిన్ల దగ్గర నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు మంచి నటనా నైపుణ్యం కల వ్యక్తులున్నారు. వచ్చిన సినిమా అవకాశాలను బట్టి వారి టాలెంట్ ప్రదర్శిస్తుంటారు. అటువంటి వారిలో ఒకరు సురేఖ వాణి. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా తన నటనతో ఆకట్టుకుంటారు. ఆమెకు 42 ఏళ్లైనా హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. ఆమెకు పెళ్లీడు వచ్చిన కూతురు ఉందంటే ఎవ్వరూ నమ్మరు. కాగా, సురేఖా భర్త సురేష్ తేజ చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆమె కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. అయితే ఇటీవల సురేఖ ఆచితూచి మాత్రమే సినిమాలు చేస్తున్నారు.
సురేఖా వాణి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. కూతురు సుప్రీత కలిసి వీడియోలు చేస్తూ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంటారు. కూతురితో సమానంగా పొట్టి పొట్టి దుస్తుల్లో నెటిజన్లు పరేషాన్ చేస్తారు. వీరి వీడియోలు సైతం నెట్టింట్లో వైరల్‌గా మారుతుంటాయి. ఇటీవల చీరకట్టులో ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు సురేఖా వాణి. తాజాగా ఓ రొమాంటిక్ వీడియోతో ముందుకు వచ్చారు. ‘చత్రపతి’ సినిమాలోని గుండు సూదీ పాటలోని మధ్యలో లిరిక్స్ కు రీల్స్ చేశారు. అందులో ఆ లిరిక్స్‌కు చాలా క్యూట్ గా డ్యాన్స్ చేస్తూ కుర్రకారును ఫిదా చేసేస్తున్నారు. ‘అమ్మమ్మో, అబ్బబ్బో, హయ్యయ్యో అన్న వినకా’లిరిక్స్ రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ తో ఇరగదీశారు.
ఈ వీడియోను ఆమె ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజన్లు కామెంట్లు, ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ‘సంపేత్తే సంపేయండ్రిరా.. అంతేకానీ.. ఇలా మీ అందంతో ఒక్కో రీల్ అప్ లోడ్ చేసి సంపకండి’అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, మరొకరు ఆంటీ చిల్ అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఏదైమైనా ఈ వయసులో ఆమె ఇంతలా షో చేయటం అనేది మాములు విషయం కాదని చెప్పాలి. ఇప్పుడొస్తున్న హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఆమె ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తుంటారు. ప్రస్తుతం పలు సినిమాలతో ఆమె బిజీగా గడుపుతున్నారు. సురేఖా వాణి సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.