ఫిల్మ్ డెస్క్- కన్నడ సోయగం రష్మిక మందన్నా సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను చాలా యాక్టీవ్ గా ఉంటుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఉత్తరాదిన కూడా రష్మిక పాపులర్ అయ్యారు. అలా మొత్తానికి నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది. దానికి తగ్గట్టే ఆమె చేసే అల్లరికి తోడవుతుంటుంది. సోషల్ మీడియాలో రష్మిక రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన గురించి, తన సినిమాలు, ఫ్యామిలీ గురించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది రష్మిక.
ఇటువంటి సందర్బాల్లో ఆమె సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. చిన్న పిల్లలా ఆమె చేసే చేష్టలు, పెట్టే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్కు అందరూ ఫిదా అవ్వడం సహజమే కదా. ఈ క్రమంలో తాజాగా రష్మిక మందన్నా తన అభిమానులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఏదైనా అడగండి ఆన్సర్ చెబుతాను అని చిట్ చాట్ చేయడం మొదలుపెట్టేశారు. ఈ నేపధ్యంలో రష్మిక ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో ప్రపోజల్స్ రావడం, ఫ్లర్టింగ్ కామెంట్లు రావడంతో రష్మిక ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్బంగా ఓ నెటిజన్ నన్ను పెళ్లి చేసుకో అని నేరుగా అడిగేశాడు.
దానికి రష్మిక తెలివిగా సమాధానం చెప్పింది. కనీసం ప్రపోజల్ అయినా కూడా మంచిగా చేయొచ్చు కదా అని వయ్యారాలు పోవడంతో ఆ నెటిజన్ మతి పోయింది. ఇక మరో నెటిజన్ మరో అడుగు ముందుకేసి.. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిందేమిటి అని ప్రశ్నించాడు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేసకుండా రష్మిక ఓ లిస్ట్ చెప్పేసింది. నైస్, క్యూట్, లో మెయింటెన్స్ అయి ఉండాలని చెప్పుకొచ్చింది. అదన్న మాట సంగతి.. రష్మికకు ఎలాంటి వాడు భర్తగా కావాలో మనసులో మాట బయటపెట్టేసింది. మరి అతను ఎక్కడున్నాడో అని అభిమాానులు నిట్టూరుస్తున్నారు.