మెహ్రీన్ ఫిర్జాద్…. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. “కృష్ణ గాడి వీర ప్రేమగాథ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అనంతరం అనేక సినిమాలు చేసి.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత వరుసగా బంఫర్ ఆఫర్లు కొట్టేసింది. బొద్దుగా ఉన్నా కూడా తన అందాలతో కుర్రకారును కట్టి పడేసింది. ఒకానొక దశలో మెహ్రీన్ స్టార్ హీరోయిన్ అవుతుందని అంత అనుకున్నారు. కానీ ఆ రేంజ్ లో పెద్ద ప్రాజెక్టుల్లో మాత్రం ఛాన్సులు రాలేదు. సినిమాలతో బిజీగా ఉండే ఈ పంజాబీ బ్యూటీ..సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇటీవల ఫోర్లిడా లో స్విమ్మింగ్ చేస్తూ దిగిన ఫోటోలు ఇన్ స్టా లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“మహానుభావుడు” మూవీలో అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఎఫ్2, ఎఫ్3లతో తో మెహ్రీన్ కి మంచి బ్రేక్ వచ్చింది. ఈ మూవీలు ఆమె కెరీర్ లోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచాయి. తన చూపులతో, సన్నని నడుము ఒంపులతో అందాల విందు చేస్తూ కుర్రకారును కట్టిపడేసింది ఈ పంజాబీ భామ. తమిళం, మలయాళం, పంజాబీ హిందీ తదితర భాషలలో కూడా నటించింది. అయితే కాగా ఆ మధ్య కొంత మేర బరువు పెరగడంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. దీంతో వెంటనే తేరుకున్న మెహరీన్ బరువు తగ్గే పనిలో పడింది. ఈ క్రమంలో ఎక్కువ సమయం జిమ్ లో వర్కౌట్లు చేస్తూ మళ్లీ బాగానే బరువు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు పలకరిస్తున్నాయి.
ఇక ఈ అమ్మడిని బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కూడా తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తోన్నాయి. ఇప్పటికే ఈ భామనే కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో మాత్రం నిత్యం తన ఫ్యాన్స్‌ను కుషీ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా మెహ్రీన్ బోటులో షికారు చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫోర్లిడా వెళ్లిన ఈ అమ్మడు అక్కడ బోటులో షికారు చేసింది.
బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని నీటిలో దూకి స్విమ్మింగ్ చేసింది. అంతే కా బోటులో హాట్ హాట్ పోజులు ఇస్తూ అందాల విందు చేసింది. బోటు కూడా నడుపుతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఆమె అభిమానులు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.