Mallika Sherawat: హిందీ సినిమాలపై అవగాహన ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘మల్లికా షెరావత్’. 2004లో వచ్చిన ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ‘మర్డర్’లో బోల్డ్ నటనతో అప్పట్లో చర్చకు తెరతీశారామె. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. మర్డర్ సినిమా టైంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై మల్లిక షెరావత్ తాజాగా స్పందించారు. ఆమె ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సినిమాలు ప్రారంభమైన కొత్తలో మహిళలకు సంబంధించి రెండు రకాల క్యారెక్టర్లు మాత్రమే ఉండేవి. ఒకటి సతీ సావిత్రి టైప్.. రెండోది వ్యాంపు. ఈ రెండు రోల్స్‌ను మాత్రమే హీరోయిన్స్ కోసం రాసేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహిళల్ని మనుషులుగా చూపిస్తున్నారు. హీరోయిన్స్ కూడా తమ శరీరం గురించి ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నేను మర్డర్ సినిమా చేసినపుడు ఎంతో బాధపడ్డా.. ఏడ్చా. ఆ సినిమాలోని కొన్ని సీన్ల గురించి ప్రజలు దారుణంగా మాట్లాడారు. ఇదే విధంగా ‘గెహ్‌రానియాన్’ సినిమాలో దీపికా పదుకొనే చేసింది. కానీ, ఆమెను మెచ్చుకుంటున్నారు. నేను 15 సంవత్సరాల క్రితం చేసినప్పుడు మాత్రం దారుణంగా విమర్శించారు. అప్పుడు ప్రజలు చాలా కుంచిత స్వభావంతో ఉన్నారు. నన్ను ఓ వర్గం పరిశ్రమ, మీడియా టార్చర్ చేసింది. వాళ్లు నా శరీరం, అందం గురించి మాత్రమే మాట్లాడారు. యాక్టింగ్ గురించి మాట్లాడలేదు. దశావతారం, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, వెల్‌కమ్ సినిమాల్లో నా నటన గురించి ఎవ్వరూ మాట్లాడలేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, మల్లికా షెరావత్ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : కిరాక్ RP మొదటి నుండి ఇంతే! ఆరోజు కిరాక్ RPని బయటకి గెంటేశా! : జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు!