మెగాస్టార్ చిరంజీవి.. పరిశ్రమలో ఆయన స్థాయి గురించి మాటల్లో చెప్పడం అసాధ్యం. అయితే.., మెగాస్టార్ అంటే కేవలం సినీ స్టార్ మాత్రమే కాదు. మంచి మనసున్న మహనీయుడు కూడా. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఆయన కొన్ని దశాబ్దాల నుండి ఎన్నో వేల కుటుంబాలలో వెలుగులు నింపారు.. నింపుతున్నారు.
కరోనా కష్ట కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి చిరంజీవి చేసిన సేవ, సినీ కార్మికుల కుటుంబాలకి ఆయన అందించిన సహాయం ఎవరూ మరచిపోలేరు. ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టే ఇండస్ట్రీ పీపుల్ సందర్భం ఏదైనా.. నిత్యం మెగాస్టార్ ని కీర్తిస్తుంటారు. తాజాగా.., సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్టార్ హీరోల మేనేజర్ రాజా రవీంద్ర ఇలాగే చిరంజీవి గొప్పతనం గురించి ఉద్వేగ పూరితంగా చెప్పుకొచ్చాడు.
రాజా రవీంద్ర ప్రస్తుతం క్రేజీ అంకుల్స్ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన కొన్ని సోషల్ మీడియా హౌసెస్ కి ఇంటర్వూస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి టాపిక్ రాగా.., రాజా రవీంద్ర ఎమోషనల్ అయ్యారు.
“అన్నయ్యతో నాది దశాబ్దాల బంధం. ఆయన ఇంటి నుండి రోజుకి కొన్ని లక్షలు సహాయంగా వెళ్తుంటాయి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా సమయంలో ఆయన ఎంత మందికి సహాయం చేశారో నేను ప్రత్యక్ష సాక్షిని. కానీ.., ఇవన్నీ ఆయన బయటకి చెప్పుకోవడానికి అన్నయ్య ఇష్టపడరు. ఈ నిజాలు తెలియని వారు ఎప్పుడైనా ఆయనపై విమర్శలు చేస్తే బాధ వేస్తుంటుంది. చిరంజీవి గారు ఒక్కరోజు సహాయం చేయడం ఆపేస్తే.. కొన్ని వందల ప్రాణాలు పోతాయి”అని రాజా రవీంద్ర కాస్త ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..,చిరంజీవి మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.