బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి ఏమైంది? ఇప్పుడు బాలీవుడ్ లో జరుగుతున్న చర్చ ఇదే. ముందురోజు అభిషేక్ బచ్చన్ ముంబై ఎయిర్ పోర్ట్ లో గాయాలతో కనిపించడం, తరువాత ఆయన హాస్పిటల్ జాయిన్ కావడం, ఆ తరువాత ముంబైలోని లీలావతి ఆసుపత్రికి సినీ సెలబ్రెటీస్ క్యూ కట్టడం లాంటి వరుస ఘటనలతో అభిషేక్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అభిషేక్ కి ఏమైందో తెలియక అభిమానులు హైరానా పడిపోతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ లో అభిషేక్ బచ్చన్ కి గాయాలు అయ్యాయట. జూనియర్ బచ్చన్ ప్రస్తుతం ‘బాబ్ బిశ్వాస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ సమయంలోనే ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బచ్చన్ కుడి చేతికి, చేతి వేళ్లకి బలమైన గాయాలు అయినట్టు తెలుస్తోంది.
ఇక కొడుకుకి ప్రమాదం జరిగిన విషయం తెలియగానే అమితాబ్ బచ్చన్, ఆయన సోదరి శ్వేతా బచ్చన్ ఆసుపత్రికి పరుగులు తీశారు. అందుతున్న సమాచారం ప్రకారం అభిషేక్ ప్రమాదం నుండి బయట పడినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఐశ్వర్య రాయ్ కూడా అభిషేక్ పక్కన లేకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఏదేమైనా.., అభిషేక్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.