బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరో, హీరొయిన్ల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కొంత మంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకున్నా సెలబ్రెటీలుగా మారారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు హీరోయిన్ కాలేదు.. కానీ అంత కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందాల ఆరబోత దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వరకు ఐరా అన్నింటిలోను ఓపెన్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంది. కొన్నిసార్లు ఆ ఫోటోలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ పై ఓ నెటిజన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతడికి సరైన బుద్ది చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. ఐరా ఖాన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో పెట్టిన ఓ వీడియోపై సింగర్ సోనా మహాపాత్ర స్పందిస్తూ.. బొమ్మలా ఎంతో ముద్దు వస్తున్నావ్ అంటూ కామెంట్ చేసింది. దానికి ఓ నెటిజన్ రెస్పాండ్ అవుతూ.. ‘ఐరా ఖాన్ వృద్దురాలిలా ఉంటుంది.. ఆమెది పంది ముఖం’అని చందన్ రామ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడి కామెంట్స్ కి ‘మీ తల్లిదండ్రులకు అవమానం కలిగించవొద్దు’ అంటూ రిప్లై ఐరా ఖాన్ రిప్లై ఇచ్చింది. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్ ల కుమార్తె ఐరా ఖాన్. ఆమెతో విడాకులు అనంతరం కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే కిరణ్ రావ్ తో కూడా విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.