పెళ్లి చేయాల్సి వస్తే.. ఎవరైనా ఈడు జోడీ బాగుందా? లేదా? అని చూస్తారు. అంటే.. ఇద్దరికీ ఏజ్ విషయంలో కూడా పెద్దగా గ్యాప్ లేకుండా చూసుకుంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితిల్లో మాత్రం అమ్మాయి వయసు అబ్బాయితో పోలిస్తే 10 ఏళ్ళు తక్కువ ఉన్నా, పెళ్లి జరిపించేస్తుంటారు. అంతేగాని.., అమ్మాయి కన్నా, అబ్బాయి ఒక్కరోజు చిన్నవాడైన ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అయితే.. ఇక్కడ మాత్రం సీన్ అంతా రివర్స్ అయ్యింది. 12 ఏళ్ళ బాలుడికి ఏకంగా 30 ఏళ్ళ వయసున్న యువతిని ఇచ్చి వివాహం జరిపించారు. కర్ణాటక రాష్ట్రంలోని కవితాల మండలంలో ఈ వింత వివాహం చోటు చేసుకుంది.
12 ఏళ్ల బాలుడుకి 30 ఏళ్ల యువతితో వివాహం చేయడానికి ప్రత్యేక కారణం ఉందట. పెళ్లి కొడుకు తండ్రి మద్యానికి బానిస. మందు తాగి, తాగి చనిపోయాడు. దీంతో.., ఆ ఇల్లు గడవడం కూడా కష్టం అయ్యింది. ఇద్దరు చిన్న కొడుకులు. వారిని పోషించడం ఆ తల్లికి కష్టంగా మారింది. అయితే.., ఇదే సమయంలో 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకుండా ఊరిలో మిగిలిపోయిన ఓ యువతిని పిల్ల చేసుకుంటే కట్నంగా కొంత డబ్బు ముట్ట చెప్తామని ఓ సంబంధం వచ్చింది. దూరపు బంధువులైన ఒకరు ఈ సంబంధాన్ని కలిపినట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి కారణంగా రెండు కుటుంబాల కష్టం తీరుతుండటంతో, గ్రామస్థులు కూడా ఈ పెళ్ళికి మద్దతు తెలిపారట. ఇలా ఈ వింత వివాహం ఎలాంటి అడ్డంకి లేకుండా హ్యాపీగా సాగిపోయింది. మరి.., ఈ పెళ్లి విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.