మీరు నిత్యం ఉద్యోగాల్లో, ఇతర పనులతో బిజీ బిజీగా గడుపుతుంటారు. వారంలో ఓ రోజు విశ్రాంతి తీసుకుంటారు. అయితే ప్రతివారంలో ఏడు రోజులు ఉంటాయి. ఈ ఏడు రోజుల వారం మన జీవితంలో అంతర్భాగం. ఇది చాలా కాలంగా జరుగుతోంది. కానీ, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారానికి 7 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయని? ఎక్కువ గానీ తక్కువ గానీ రోజులు ఎందుకు ఉండవు? వారంలో ఏడు రోజులు మాత్రమే ఉండాలి, అది ఎలా ఎవరు నిర్ణయించారో తెలుసా? అసలు వారానికి ఏడు రోజులు ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వారానికి 7 రోజులు ఉండే సంబంధించిన ఓ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. వారానికి ఎన్ని రోజులు ఉండాలనేది చాలా మంది అధ్యయనం చేశారు. గ్రహాలు, సూర్యుడు, చంద్రుల కదలికల ఆధారంగా వివిధ నిర్ణయాలు తీసుకున్నారు. పూర్వం బాబిలోన్ ఖగోళ గణనలలో చాలా నైపుణ్యం, అభివృద్ధి కలిగి ఉండే వారు. వారానికి 7 రోజులు అనే కాన్సెప్ట్ తో వారు ముందుకు వచ్చారని ఈ విషయాన్ని ఒక పత్రిక వెల్లడించింది.
గ్రహాల కదలికల నుండి ఏడు రోజులను వారంగా స్వీకరించారు. పరిశోధకులు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, బృహస్పతి గ్రహాల కదలికలను గమనించారు. చంద్రుని 28 రోజుల కక్ష్య ఆధారంగా 7 రోజుల నాలుగు వారాలు తయారు చేశారు. ఆ కాలంలో ఈజిప్ట్, రోమ్ లలో వారం ఎనిమిది లేదా పది రోజులుగా ఉండేది. అదనంగా ఎల్లప్పుడూ వారాంతాల్లో పూజలు చేశారు. ఇంక భారత్ విషయానికి వస్తే.. అలెగ్జాండర్ భారతదేశంలో గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేశాడు. ఏడు రోజులను వారంగా భారతదేశానికి వ్యాప్తి చేశాడు అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. తర్వాత చైనా కూడా ఏడు రోజుల వారాన్ని ప్రారంభించిందని నమ్ముతారు. వీరు అదనంగా ఈ ఏడు రోజులకు పేర్లు పేట్టారు.
రోమ్ లో ఈ విషయంపై చాలా ప్రయోగాలు జరిగాయి. ఇస్లాం , జుడాయిజం ప్రజలు వారానికి ఒక రోజు ప్రార్థన కోసం, వారంలో ఏడు రోజులు కేటాయించారు. కానీ మిగిలిన వారంతా 6 రోజులు పని చేసి, ఒక రోజు మతపరమైన పనుల కోసం కేటాయించడం ప్రారంభించారు. ప్రజలందరికీ అదే వర్తించింది. దీని తర్వాత అక్కడి వారు ఒక్కో గ్రహానికి ఒక రోజును కేటాయించారు. ఆ కాలానికి ఏడు రోజులకు శని, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలుగా మారిపోయాయి. ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో చేసిన అనేక పరిశోధనలతో చివరికి గ్రహాల ఆధారంగా, మరికొన్ని ఇతర కారణాలతో వారానికి ఏడు రోజులుగా నిర్ణయించారని కొందరి అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.