బిగ్బాస్ సీజన్-3లో జర్నలిస్టు జాఫర్, బాబా భాస్కర్ షోలో చేసిన అల్లరి గురుంచి అందరికీ తెలిసిందే. ఆ సీజన్లో వారిద్దరూ కలిసి మెలిసి స్నేహపూరిత వాతావరణంలో ఉన్నారు. ఆ షోలో ఉన్న వాళ్లందరి కంటే బాబా భాస్కర్, జాఫర్ ప్రత్యేకంగా కనిపించారు. ఏదీ చేసిన వాళ్లిద్దరూ కలిసి కూర్చోడటం, కలిసి పడుకోవటం, తినటం వంటివి చేయటంతో వారిద్దరూ ఆ షోలో మంచి స్నేహితులుగా మారారు. ఆ షో నుంచి జాఫర్ ఎలిమినేట్ కావటంతో బాబా భాస్కర్ బోరున ఏడ్చారు. దీంతో వారి పట్ల ఉన్న స్నేహం అట్టే అర్థమైంది.
అయితే ఆ షో నుంచి బయటకు వెళ్లాక మాములుగానే ఉంటారనుకున్నారు అందరూ. కానీ ఎప్పటికైన మా ఇద్దరి స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఇద్దరూ పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా బాబా భాస్కర్ ఇంట ఓ శుభకార్యం జరిగింది. దీనికి జాఫర్ గారిని పిలిచాడు బాబా భాస్కర్. దీంతో వచ్చిన వెంటనే బాబా భాస్కర్ పలకరించి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫోటోలు దిగి స్నేహ పూర్వకంగా ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు. ఇక ఇదే వారి స్నేహానికి నిదర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు వారి అభిమానులు. దీనిని తాజాగా జాఫర్ తన ఫేస్ బుక్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.