బిగ్ బాస్ సీజన్ 6 ఆల్రెడీ నడుస్తోంది. కంటిస్టెంట్లు హౌజ్ లోకి వెళ్లారు. అంతా సవ్యంగానే ఉంది అనుకునే టైంకి సీపీఐ నారాయణ తెరపైకి వచ్చారు. గతంలో ఆల్రెడీ ఈయన బిగ్ బాస్ షో మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, ఈ షో వల్ల ఎవరికీ ఉపయోగం లేదని ఇలా రకరకాలుగా బిగ్ బాస్ షో మీద సీపీఐ నారాయణ దారుణంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి ఆయన ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ షోని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. బిగ్ బాస్ షో ఒక బ్రోతల్ హౌజ్ అని, ఆ షోలో పాల్గొనే అమ్మాయిలు, అబ్బాయిలు చేసే పని అదే అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఈ విమర్శలను ఖండిస్తూ గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్.. నారాయణతో డిబేట్ చేశారు. అయితే ఈ డిబేట్ లో జాఫర్ ను సైతం విమర్శిస్తూ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు బ్రోతల్ హౌజ్ నుంచి వచ్చిన వాళ్ళే అని మీరు అన్న స్టేట్ మెంట్ ని వెనక్కి తీసుకుంటారా?” అని జాఫర్ నారాయణను అడిగారు. దానికి సీపీఐ నారాయణ స్పందిస్తూ.. “నీ ఇంట్లో ముక్కూ, మొఖం తెలియని యువతీ, యువకుల్ని ఒక 20 రోజులు తలుపేసి పెట్టుకో. ఊళ్ళో జనం ఏమంటారో నాకు చెప్పు. జాఫర్ బ్రోతల్ హౌజ్ నడుపుతారని అంటారే తప్ప సంసారి కొంప అని ఎవరూ అన్నారు” అంటూ కామెంట్స్ చేశారు.
దీనిపై జాఫర్ స్పందిస్తూ.. తాను కూడా ఆ షోకి వెళ్లానని, అలాంటివి ఏమీ అక్కడ జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ సీపీఐ నారాయణ మాత్రం తన అభిప్రాయం మాత్రం అదే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొచ్చిన వాళ్ళు పతివ్రతలు ఎలా అవుతారు అంటూ కామెంట్స్ చేశారు. తాను గతంలో బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చానని, బిగ్ బాస్ హౌజ్ బ్రోతల్ హౌజ్ కాదని స్పష్టం చేశారు. మరి సీపీఐ నారాయణ బిగ్ బాస్ షోపై చేసిన ఘాటు వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.