కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా దూకుడు పెంచారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ తనదైన స్టైల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నాని వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏకంగా చంపేస్తామంటూ బహిరంగంగా హెచ్చరించాడు. అంతేకాక కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఈ క్రమంలో సుమన్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ జాఫర్.. బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై విరణ కోరారు. చంపుతామని ఒపెన్‌గా వార్నింగ్ ఇచ్చారు.. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా.. అని జాఫర్ ప్రశ్నించారు.
ఇక జాఫర్ నిర్వహించిన డిబెట్లో కూడా బుద్ధా వెంకన్న ఎక్కడా తగ్గలేదు. కొడాలి నానిపై పరుష వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన డిబెట్ వీడియో వైరల్‌గా మారింది. మరి బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.