వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్ టీమ్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. తమ అధినేత మీద, పార్టీ మీద ప్రతి పక్షాలు చేసే విమర్శలును తిప్పికొట్టడంలో కొడాలి నాని దూకుడుగా వ్యవహరిస్తారు. ఇక వైసీపీ స్థాపించిన నాటి నుంచి సీఎం జగన్ వెన్నంటి ఉన్న కొడాలి నానికి.. అధినేత మంచి ప్రాధాన్యం ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కొడాలి నానికి మరో అవకాశం కల్పించలేదు. ఈ క్రమంలో ప్రస్తుం కొడాలి నాని గతంలో మాదిరి దూకుడుగా వ్యవహరిండం లేదు. తన నియోజకవర్గం బాధ్యతలకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కొడాలి నానికి సంబంధించి ఓ వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. ఆ వివరాలు..
త్వరలోనే ఏపీలో మరోసారి కెబినేట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తీసుకున్న కొందరు మంత్రులు పని తీరు సరిగా లేదని.. తర్వలోనే వారిపై వేటు పడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు.. ఆయనను కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. విపక్షాలకు చెక్ పెట్టాలంటే కొడాలి నానిలాంటి నేతలే కీలకమని వైసీపీ అధిష్టానం భావిస్తుందని.. అందువల్ల త్వరలోనే కొడాలి నానిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇవి నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. మరి కొడాలి నానిని మరోసాని మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.