అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం సూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప రిలీజ్ అయిన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో కలెక‌్షన్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాలోని పాటలు, డైలాగ్‌లు, అల్లు అర్జున్ మ్యానరిజం బాగా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో అయితే పుష్పకు బీభత్సమైన క్రేజ్ వచ్చింది. పుష్పలోని డైలాగ్‌లు సామాన్య జనాలే కాకుండా.. అంతర్జాతీయ క్రికెటర్లు సైతం చెప్తు అదరగొడుతున్నారు.
ఇప్పటికే శిఖర్ ధావన్, జడేజా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప డైలాగ్‌లు, స్టెప్పులతో అదరగొట్టారు. రిసెంట్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ కూడా గ్రౌండ్‌లోనే అల్లు అర్జున్ మ్యానరిజం ఇమిటేట్ చేశాడు. తాజాగా టీమిండియా స్పిన్నర్ యుజేంద్ర చాహల్ కూడా పుష్పలోని తగ్గేదేలే డైలాగ్‌ను చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి చాహల్ డైలాగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.