తెలుగు చిత్ర పరిశ్రమకు, రాజకీయ రంగానికి విడదీయ రాని అనుబంధం ఉంది. ప్రస్తుతం దానికి తగ్గట్లే హీరోలు, రాజకీయ నాయకులు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతలుగా రాజకీయ నాయకులు వ్యవహరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇటు ఇండస్ట్రీలో.. అటు రాజకీయ రంగంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మరి ఆ వార్తలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
నట్టికుమార్.. నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని టాలీవుడ్ లో ఏర్పరచుకున్నాడు. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో జరిగిన వివాదంతో ఈ మధ్య మీడియా ముందుకు వచ్చారు. తరువాత ఇద్దరి మధ్య మాటలు కలిసి ఆ వివాదం సద్దుమణిగింది. నట్టి కుమార్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాలపై అలాగే తన రాజకీయ రంగ ప్రవేశంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నట్టికుమార్ మాట్లాడుతూ.. ”దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నాకు అభిమాని. కేసీఆర్ నాకు ఫ్రెండ్. నా అభిమాని కూడా. అయితే ఇప్పుడు ఆయన నాకు ఫ్రెండ్ కాదు. కేసీఆర్ గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి స్నేహితుడు. అలాగే వైఎస్ఆర్ ఫాలోవర్‌గా నాకు వైసీపీ అంటే బాగా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరిగాను. ఈ రెండు పార్టీలు అంటేనే నాకు సానుభూతి. ప్రస్తుతం నేను ఏ పార్టీలోనూ లేను.” అని నట్టికుమార్ వారితో తనకు ఉన్నఅనుబంధాన్ని గురించి తెలిపారు.
అలాగే నాకు మెుదటి నుంచి టీడీపీ అంటే పడదని నట్టికుమార్ తెలిపారు. అలా అని నేను బీజేపీకు మద్దతు తెలపడంలేదని స్ఫష్టం చేశారు. అయినప్పటికీ ఆ రెండు పార్టీల్లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని తెలిపారు. మాది మెుదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీనే అని గుర్తుచేశారు. ఈక్రమంలోనే తనకు హీరో పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అంటూనే.. పొలిటికల్ గా వైసీపీనే ఇష్టం అని వివరించారు. అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాటను నిర్మాత నట్టికుమార్ బయటపెట్టాడు. మరి నట్టికుమార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తమ్ముడు పవన్ నాతో కలిస్తే నిన్ను APకి ముఖ్యమంత్రిని చేస్తా: KA పాల్
ఇదీ చదవండి: Mega Millions Lottery: ఒకే ఒక్క లాటరీ టిక్కెట్ కొని రూ.10,588 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు!