సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు అనగానే విడాకులు, ఆన్ లైన్ లో సెటైర్లు, ఆఫ్ లైన్ లో దెబ్బలాటలు అని అభిమానులు ఎప్పుడూ ఎద్దేవా చేస్తుంటారు. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వైవాహిక జీవితం ఇందుకు పూర్తి విరుద్ధం. పునీత్ రాజ్ కుమార్ ఆయన భార్య అశ్వినీ రేవంత్ ఎంత అన్యోన్యంగా జీవిచారో కచ్చితంగా తెలుసుకోవాలి. పునీత్ రాజ్ కుమార్ ప్రేమ, పెళ్లి, దాంపత్య జీవితం అన్నీ ఎంతో హుందాగా నలుగురికి ఆదర్శంగా సాగాయి. ఈ విషయంలో మొత్తం క్రెడిట్ అశ్వినీ రేవంత్ కే దక్కుతుంది. అసలు వీళ్ల పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మీకోసం.
ముచ్యువల్ ఫ్రెండ్స్ ద్వారా పునీత్ రాజ్ కుమార్, అశ్వినీ రేవంత్ పరిచయం ఏర్పడింది. అశ్వినీకి సినిమాలు అంటే పెద్దగా పడదు.. అంతగా చూడదు కూడా. పునీత్ కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కొడుకు. వెండితెరకు హీరోగా ఎంట్రీ ఇద్దామని ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరివి భిన్న ధృవాలు.. భిన్నమైన అభిరుచులు. కొన్ని నెలలపాటు అప్పుడప్పుడు కలవడం.. మాట్లాడటం చేసేవాళ్లు. మెల్లగా పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. దాదాపు 8 నెలలు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే ప్రేమ అనే భావనకు వచ్చారు. పునీత్ ఇంట్లో చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. ఆ రోజుల్లో తండ్రిని ఏదైనా విషయం అడగాలంటేనే వణికిపోయేవారు. అలాంటింది ప్రేమ విషయం చెప్పడం అంటే మాటలా? కానీ, పునీత్ ధైర్యంగా చేశాడు. నాన్నా మీతో ఒక విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెకు ఇండస్ట్రీతో సంబంధం లేదు అంటూ చెప్తున్నాడు. ఒకింత ఆనందం.. ఆశ్చర్యంతో పునీత్ వైపు చూశారు కంఠీరవ రాజ్ కుమార్. వెళ్లి మీ అమ్మతో మాట్లాడు.. ఆమె ఇష్టమైతే నాకు ఏ అభ్యంతంరం లేదని రాజ్ కుమార్ తెలిపారు.
పునీత్ తన తల్లికి విషయం చెప్పారు. నేను అమ్మాయిని ఒకసారి చూడాలని కోరారు పార్వతమ్మ రాజ్ కుమార్. అశ్వినీని కలిసి అమ్మాయి నాకు నచ్చింది అంటూ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అశ్వినీ కుటుంబంలో మాత్రం వారికి ఏదో తెలియని భయం. అసలే ఇండస్ట్రీ అంటే ఏవేవో పుకార్లు ఉండేవి. అలా పెళ్లి ప్రస్తావనను తోసిపుచ్చుతూ వచ్చారు. అశ్వినీ స్ట్రాంగ్ గా నిర్ణయించుకోవడంతో వాళ్లు కూడా ఒప్పుకున్నారు. 1999 డిసెంబరు 1న వారివురి వివాహం పెద్దల సమ్మతితో జరిగింది. ఇప్పటికీ అశ్వినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అని దాదాపు ఎవరికీ తెలీదు. అంత లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తారు. పెళ్లి తర్వాత అశ్వినీ రేవంత్ ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే.. మరోవైపు పునీత్ కాస్ట్యూమ్స్ గురించి కూడా శ్రద్ధ పెట్టేది. ఎప్పుడూ మిసెస్ పునీత్ గానే ఉంటూ వచ్చింది తప్ప, తనకంటూ ఆమె ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు కోసం తాపత్రయం పడలేదు.
సెలబ్రిటీ కుటుంబం అనగానే బెరుకు, భయంతోనే ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది అశ్వినీ రేవంత్. ఎప్పుడూ ఇంట్లో దాదాపు 30 మంది వరకు ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక హడావుడి ఉంటుంది. దాదాపు ఒక నెలకు పైగా బాగా ఇబ్బంది పడింది అశ్విని. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వోన్ చేసుకుంది. ఇది నా పునీత్ రాజ్ కుమార్ కుటుంబం, ఆ అత్తగారి కుటుంబం అనే భావన ఆమె మదిలో బలంగా వచ్చేసింది. అక్కడ నుండి రాజ్ కుమార్ ఇంటి కోడలిగా అశ్విని జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
భర్త నటించిన చాలా సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది అశ్విని. కొన్ని సినిమాలకి నిర్మాతగా వ్యవహరించింది. పునీత్ సినీ కష్టాల్లో పాలు పంచుకుంది. తనకి ఏ మాత్రం తెలియని సినీ రంగాన్ని భర్త కోసం అర్ధం చేసుకుంది. తన భర్త నటిస్తున్న సినిమాల తాలూకు కథలు తెలుసుకోవడం, షెడ్యూల్స్ తెలుసుకోవడం అశ్వినికి అలవాటు. షూటింగ్ డేట్స్ బట్టి అశ్విని భర్తతో నడుచుకునేది తప్ప, ఎప్పుడూ పునీత్ ని ఇబ్బంది పెట్టకుండానే వచ్చింది అశ్విని. ఈ ప్రయాణంలో ఆమెకి సినిమా అంటే ఎంత కష్టమో అర్ధం అయ్యింది. భర్త ఎందుకు ఇంత కష్టపడుతున్నాడో తెలిసి వచ్చింది.
తన భర్త అభిమానులను ఆప్యాయంగా పలకరించడం అలవాటు చేసుకుంది. ఇక తన అభిమానులను సంతృప్తి పరచడానికి పునీత్ నిరంతరం కష్టపడేవారు. ఆ ప్రతి కష్టంలో భర్తకి తోడుగా నిలిచి ఆదర్శ గృహిణి అనిపించుకుంది అశ్విని. ఇలా గొప్పింటి కోడలిగా 100 కి 100 మార్కులు సొంతం చేసుకుంది అశ్విని. ఇక వ్యక్తిగత జీవితంలో వీరికి ఇద్దరు కుమార్తెలు. అప్పటి నుంచి ఈ 22 సంవత్సరాల్లో ఎప్పుడూ రాజ్ కుమార్ భార్యగా అశ్విని ఇబ్బంది పడలేదు.. దాంపత్య జీవితంలో వెనుదిరగలేదు. అంత చక్కగా అన్యోన్యంగా ఉండే జంట విధి ఆడిన వింత నాటకంతో ఇప్పుడు విడిపోయింది. మరి.. జీవితం అంతా భర్త కోసమే బతికిన అశ్వినీకి ఇది తీర్చలేని లోటు. ఆమె ఈ కష్టం నుండి త్వరగా కోలుకోవాలని.. మీ సానుభూతిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.