పవర్ స్టార్ అనగానే మనకు పవన్ కల్యాణ్ గుర్తొస్తారు. కానీ కన్నడ ప్రేక్షకులకు మాత్రం పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకం వస్తారు. ఓ హీరోని ఎంతలా అభిమానించొచ్చు అనేది ఆయన క్రేజ్ చూసిన తర్వాత టాలీవుడ్ ఆడియెన్స్ కి అర్థమైంది. గుండెపోటుతో ఆయన మరణించినప్పుడు కర్ణాటకలోనే కాదు యావత్ దేశంలో చాలామంది బాధపడింది. తెలుగు హీరోలు కూడా పునీత్ తో తమకున్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక పునీత్.. ఎప్పటికీ అలా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు.
ఇక విషయానికొస్తే.. కన్నడ కంఠీవ రాజ్ కుమార్ కు ముగ్గురు వారసులు. వారిలో శివరాజ్ కుమార్ కన్నడలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ కూడా ఉండుంటే.. ఈ పాటికి కచ్చితంగా పాన్ ఇండియా హీరో అయి ఉండేవాడు. కానీ అనారోగ్య సమస్యలతో పునీత్ మరణించడం.. కన్నడ ఇండస్ట్రీకి తీరని లోటే. అందుకే కన్నడలో పలువురు హీరోలు.. తమ సినిమా ప్రారంభానికి ముందు పునీత్ ని గుర్తుచేసుకుంటూ ఉంటారు. అంతలా అభిమానం సంపాదించాడు. మరి సహనటీనటులకే అంతలా అభిమానం ఉంటే సొంత అన్న అయిన శివ రాజ్ కుమార్ కు ఏ రేంజ్ లో ఉండి ఉండాలి.
తమ్ముడు పునీత్ కు గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా సరే హీరో శివన్న ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కూడా తన కొత్త సినిమా ‘వేద’ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు. తాజాగా ఈవెంట్ కూడా జరిగింది. ఇందులో భాగంగా పునీత్ AV ప్లే చేయగా, దాన్ని చూస్తూ ఆయన తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. దీంతో పక్కనే ఉన్న బాలయ్య.. ఆయన్ని ఓదార్చుతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. శివన్న ఏడవడం కాదు.. చూస్తున్న నెటిజన్స్ కూడా కంటతడి పెట్టుకునేలా చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
పునీత్ రాజ్ కుమార్ AV చూసి బావోద్వేగానికి గురైన శివన్న ని ఓదారస్తున్న బాలయ్య.#NandamuriBalakrishna #Vedha #ShivaRajKumar @NimmaShivanna#PuneethRajkumarLivesOn pic.twitter.com/tWzzlB5Hbp
— manabalayya.com (@manabalayya) February 7, 2023