హీరోయిన్ కియారా అద్వాణీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఆమె మ్యాంగ్ చేతిలో పట్టుకుని అదే కలర్ డ్రెస్ ధరించిన కారణంగా, పెళ్ళైన నెల రోజుల్లోనే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ క్రేజీ కపుల్స్ లో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంట ఒకటి. గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట.. గతనెల 7న పెళ్లి చేసుకొని కొత్త జీవతంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ లోని ఓ ప్యాలెస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత ఏర్పాటు చేసిన రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. వీరి వివాహం జరిగి నెల రోజులు తిరక్కుండానే, కియరా గర్భవంతి అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొట్టడుతున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా తాజాగా ఈ అమ్మడు మామిడి కాయ తింటూ ఫోటోకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. ఆ తర్వాత పిల్లలకు జన్మనివ్వడంలో ఉండే ఆనందం వర్ణించడం ఎవరి తరం కాదు. అది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైన ఒకటే. అయితే గత కొంతకాలంగా పెళ్లి ముందే ప్రెగ్నెంట్ అయినా బాలీవుడ్ జంటలు కొన్ని ఉన్నాయి. గతంలో ఆలియా భట్ ఇలానే పెళ్లి చేసుకుందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తో పెళ్లై అతి తక్కువ సమయంలో ప్రెగ్నెంట్ అయ్యి అందరిని ఆశ్చర్య పరిచింది. తాజాగా ఆమె బాటలోనే కియారా అద్వానీ కూడా వెళ్లిందా?, ఈ భామ కూడా ప్రెగ్నెంట్ కావడంతోనే ఆ ప్రేమ జంట అకస్మాత్తుగా పెళ్లి చేసుకున్నారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కియారా అద్వాని సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కియారా పసుపు రంగు డ్రెస్ ధరించి.. చేతిలో మామిడి పండ్లు పట్టుకుని ఉంది. చేతిలోని మ్యాంగో, వేసుకున్న డ్రెస్ కలర్ ఒకేలా ఉన్నాయి. దీంతో కియారా కూడా త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫోటోలను లీక్ చేస్తూ కొందరు కియారా గర్భవంతి అంటూ ప్రచారం చేస్తున్నారు. అలియా భట్ మాదిరిగానే కియారా కూడా పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అంటూ మీమ్ రాయుళ్లు రకరకాల మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. పెళ్లై నెల రోజులు గడవక ముందే కియారా ప్రెగ్నెంట్ ఎలా అవుతోందని మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రూమర్స్ పై మరింత సందేహం వ్యక్తం చేస్తూ గతంలో బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ ఓ ట్వీట్ చేశాడు. ” ముందుగా గర్భం దాల్చి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ కొత్త సంప్రదాయం. మూలాల ప్రకారం.. బాలీవుడ్‌లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కూడా అదే ఫార్ములాని ఫాలో అయ్యింది” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అయితే ఆ సమయంలో నెటిజన్లు కమల్ పై ఫైర్ అయ్యారు. మరి.. కియారా అద్వానీ విషయంలో వస్తున్న వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి.. కియారా అద్వానీపై వస్తున్న రూమర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.