Vijay Devarakonda: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో భగ్న ప్రేమికుడిగా విభిన్న నటనతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిల మనసును కొల్లగొట్టారు. ‘గీతా గోవిందం’ సినిమాలో సగటు అమ్మాయి కోరుకునే అబ్బాయిగా కనిపించి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండకు అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా, వెలుగులోకి వచ్చిన ఓ ఘటన విజయ్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు అద్ధం పడుతోంది.
ఇంతకీ సంగతేంటంటే.. ఓ అమ్మాయి విజయ్ దేవరకొండ చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకుంది. డాక్టర్ చెర్రీ అనే అమ్మాయి ‘లైగర్’ సినిమాలోని విజయ్ ముఖాన్ని తన వీపుపై పచ్చబొట్టు వేయించుకుంది. ముఖంపక్కనే ఓ లవ్ సింబల్ కూడా ఉంది. చెర్రీ వీపుపై విజయ్ పచ్చబొట్టు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన విజయ్ దేవరకొండ ఆమెను కలవటానికి పిలిచాడు. తాజాగా, డాక్టర్ చెర్రీ.. విజయ్ దేవరకొండను కలిశారు. తన స్నేహితురాలితో కలిసి విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లారు.
అక్కడ విజయ్ ఆమెను ఎంతో అభిమానంగా పలకరించారు. కొద్దిసేపు ఆమెతో ముచ్చటించారు. ఆ సమయంలో విజయ్‌తో పాటు ‘లైగర్’ దర్శకుడు పూరీ జగన్నాథ్, ప్రొడ్యూషర్ చార్మీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, డాక్టర్ చెర్రీ హీరో విజయ్ దేవరకొండ ముఖాన్ని వీపుపై వేయించుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ram Charan: రామ్ చరణ్ ను కలిసేందుకు ఓ వీరాభిమాని.. బళ్లారి నుంచి హైదరాబాద్ కి ప్రయాణం!