SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Wishing Megastar Chiranjeevi On His 66th Birthday

చిరంజీవుడికి జన్మదిన శుభాకాంక్షలు

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 21 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చిరంజీవుడికి జన్మదిన శుభాకాంక్షలు

‘మెగాస్టార్‌ చిరంజీవి’ అది పేరు కాదు… మహా శిఖరం. కఠోర శ్రమ, ధృఢ సంకల్పంతో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించిన మహోన్నత వ్యక్తి. ఓ మధ్యతరగతి కానిస్టేబుల్‌ కొడుకు నుంచి మహాశక్తిగా ఎదిగిన ఘనత ఆయనది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహా మనిషి. క్రమశిక్షణ, అంకితభావానికి మరో పేరు. ఆపదలో ఉన్నవాడికి అన్నయ్యగా, అవకాశం కోసం చూస్తున్న వాడికి ఆపద్బాంధవుడిగా ఆయన సేవలుకు అంతే లేదు. ఆయనను మనిషిగా కాదు.. దేవుడిగా కొలిచే వారికి లెక్కే లేదు. స్నితప్రజ్ఞతతో మెగాస్టార్‌ చిరంజీవుడిగా, పద్మభూషణుడిగా ఎదిగిన కొణిదెల శివశంకర వరప్రసాద్‌కు ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Happy Birthday Chiranjeeviఏం చేయాలో తెలీక సరాదాగా సినిమాల్లోకి రాలేదు. నటుడు కావాలనే కృతనిశ్చంతో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది వచ్చాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరూ లేకపోయినా నమ్ముకున్న ప్రతిభతోనే పైకొచ్చాడు. ‘పునాదిరాళ్లు’తో సినిమా కెరీర్‌కు పునాది వేసుకున్న మెగాస్టార్‌ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా ఎదిగాడు. అప్పటికే తెలుగు సినిమాకు మూల స్తంభాలుగా ఉన్న పెద్ద హీరోల పోటీని తట్టుకుని ‘స్వయంకృషి’తో ఎదిగాడు. ‘ఖైదీ’గా సినీ జీవితంలో మంచి గుర్తింపు సాధించారు. అప్పటి నుంచి కెరీర్‌లో తిరిగి చూసుకున్నది లేదు. కుప్పలు తెప్పలుగా అవకాశాలు. ఫ్యాన్స్‌లో ‘మాస్‌ హీరో’గా బ్రాండ్‌ ఇమేజ్‌ సంపాదిచారు. ఎప్పుడూ మాస్‌ హీరోగానే కాదు. ఆపద్బాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి వంటి ప్రయోగాలను కూడా చేసి మెప్పించారు.

Mega Star chiranjeeviఆపద్బాంధవుడు సినిమాకి కోటీ 25 లక్షల రూపాయలు తీసుకుని ‘బిగ్గర్‌ దాన్‌ బిగ్‌ బి’ అని జాతీయ మీడియా ప్రస్తావించే స్థాయికి ఎదిగారు. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోలేదు. తాను పడ్డ కష్టాలు రాబోయే తరాలవారు పడకూడదని ఎప్పుడూ అనుకునేవారు. చిన్న, పెద్ద, గొప్ప అనే తారతమ్యాలు లేకుండా అన్నయ్యా అన్న ప్రతి ఒక్కరికి ఆపన్నహస్తం అందించారు.. అందరివాడయ్యారు.

chiranjeevi Biographyచిరంజీవి సినిమాల్లోకి రాకముందు నుంచే అప్పటి హీరోలు వేసిన డ్యాన్సులను తనదైన శైలిలో వేసి స్నేహితులను అలరించేవాడు. ఫోక్‌, బ్రేక్‌, డిస్కో, క్లాసికల్‌ డ్యాన్స్‌ ఏదైనా చిరంజీవి తన స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించేవారు. భావితరం నటులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనతో చేసిన డ్యాన్స్‌ మాస్టర్లు, హీరోయిన్లు ఎవరైనా ఆయన డ్యాన్సుకు ఫిదా అవ్వాల్సిందే. అలా ఎంతో మంది, ఎన్నో సందర్భాల్లో చిరంజీవి స్టెప్పులను గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

chiranjeeviఇప్పుడున్న డైరెక్టర్లు, హీరోలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, కమెడియన్లు ఇలా ఎవరిని కదిపినా నేను చిరంజీవిని చూసే ఇండస్ట్రీకి వచ్చా అన్నమాట వినిపిస్తుందనడం అతిశయోక్తి కాదు. ఆయనను చూసి వచ్చిన వారు కొందరైతే ఆయన చేయూతతో పైకొచ్చిన వారు కొందరు. ఎందరో సినిమా ఇండస్ట్రీకి పరిచయం కావడంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చిరు పాత్ర ఉంది.

chiranjeevi GodFatherచిత్ర పరిశ్రమలో చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా విజయం సాధించిన ప్రతిఒక్కరిని అభినందిస్తుంటారు చిరంజీవి. బొకే, మెసేజ్‌, ఫోన్‌ ఇలా ఏదోరకంగా యువ హీరోలను చిరు ప్రోత్సహిస్తూనే ఉంటారు. చిరంజీవి మెసేజ్‌ చూడగానే ఆశ్చర్యపోయాను. చిరంజీవి ఫోన్‌ చేయగానే షాక్‌ అయ్యాను ఈ మాటలు తరచూ వింటూనే ఉంటారు. అలా చిరు తనదైన శైలిలో యువతను ప్రోత్సహిస్తూనే ఉంటారు.

God Fatherచిరంజీవి అనగానే నటన, డ్యాన్స్‌, ఫైట్స్‌ మాత్రమే కాదు… సమాజసేవ కూడా గుర్తొస్తుంది. సినీ పరిశ్రమలో ఆయన ఎంతమందిని ఆదుకున్నారో, ఎందరి జీవితాల్లో వెలుగులు నింపారో వారంతట వారు చెప్తేనే తెలుసుకోగలం. ఆయన చేసిన సాయం రెండో చేతికి కూడా తెలియకుండా చేసిన గుప్త ధానాలు ఎన్నెన్నో. చిరంజీవి బ్లడ్‌ అండ్‌ ఐ బ్యాంక్‌తో ఆయన నిలిపిన ప్రాణాలు ఎన్నో. కరోనా సమయంలో సినీ పరిశ్రమ కోసం ట్రస్టు ఏర్పాటు చేయడం. ఆక్సిజన్‌ అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఆక్సిజన్‌ బ్యాంక్‌లు ప్రారంభించడం. ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది. చిరంజీవికి సమాజం పట్ల ఉన్న సేవాభావం ఎలాంటిదో. అంతటి మహోన్నత వ్యకి పద్మ భూషణుడు మెగాస్టార్‌ చిరంజీవికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.

Tags :

  • Chiranjeevi
  • chiranjeevi birthday
  • Mega Star Birthday
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

    ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

  • మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

    మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

  • ఇదీ చిరంజీవి వ్యక్తిత్వం అంటే!..

    ఇదీ చిరంజీవి వ్యక్తిత్వం అంటే!..

  • చిరంజీవితో సినిమాని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి..

    చిరంజీవితో సినిమాని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam