ప్రస్తుతం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఒకటి. రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మాఫియా డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఇక ఈ క్రేజీ మూవీకి సంబంధించి ప్రస్తుతం సినీ వర్గాలలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఓ రకంగా చెప్పాలంటే కన్నడ ప్రేక్షకులకంటే తెలుగు ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో సినిమా థియేట్రికల్ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడైనట్లు సమాచారం. అయితే.. ఈ సినిమా కోసం ఏపీలో ప్రత్యేక ధరలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. కానీ ఏపీలో కొత్త జీవోల కారణంగా సందేహంలో పెద్ద్దరట మేకర్స్.
ఏపీలో అమలు చేసిన కొత్త జివోలు, రూల్స్ తెలుగు సినిమాలకే పరిమితమా లేక స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయా లేదా అనే డౌట్స్ ఏర్పడుతున్నాయి. మరి పాన్ ఇండియా సినిమా అయిన కేజీఎఫ్ 2 మూవీకి కొత్త జివో ప్రకారం అనుమతులు లభిస్తాయా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2 మూవీకి టికెట్ ధరను 50 రూపాయల వరకు హైక్ కోసం చిత్రబృందం ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడతారని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి కేజీఎఫ్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.