Meena Husband: కొద్దికాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీతారలు అనారోగ్య సమస్యలతో మృతి చెందగా, తాజాగా నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది సినీ ప్రముఖులు దూరమైన సంగతి తెలిసిందే. అయితే.. మీనా భర్త కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది.
ఆరోగ్య పరిస్థితి సరిలేక కొంతకాలంగా విద్యాసాగర్ చెన్నైలోనే ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మీనా భర్త మృతి చెందడంతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు మీనా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
విద్యాసాగర్ ని బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు. విద్యాసాగర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో జూన్ 28న ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌తో 2009లో మీనా వివాహం జరిగింది. వీరికి ఒక పాప పేరు నైనిక. ఆ మద్య తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మూవీలో ఆయన కూతురిగా నటించింది. మరో పదమూడు రోజుల్లో పెళ్లి రోజు వస్తుంది.. ఇంతలోనే ఈ విషాద ఘటన జరిగింది. ప్రస్తుతం మీనా కుటుంబం శోకసంద్రంలో మునిగింది.