బాలీవుడ్ ప్రేమజంట రణబీర్ కపూర్ – అలియా భట్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లిపై ఎన్నో రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎట్టకేలకు బీ-టౌన్ స్టార్ జోడీ గురువారం పెళ్లితో ఒక్కటైపోయింది. బాంద్రాలోని రణబీర్ కపూర్ నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో రణబీర్ – అలియాల వివాహం ఘనంగా జరిగింది. ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. పెళ్లి పనుల నుంచి మూడు ముళ్ళు పడేవరకు ఈ జంట ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. పెళ్లి తర్వాత అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలను షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో ఈ జంట ఎంతో అందంగా ముస్తాబయ్యారు. వీరి పెళ్లిపై బిగ్ బాస్ టైటిల్ విన్నర్ వీజే సన్నీ స్పందించాడు.
ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. సినీనటుడు కే.వాసుదేవన్ కన్నుమూత!
మొదటి నుంచి సన్నీ అలియా అభిమాని అని అందరికీ తెలుసు. గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ షోకి వచ్చి మరీ.. సన్నీకి అలియా భట్ ఐ లవ్ యూ చెప్పింది. ఆ తర్వాత సన్నీ చెప్పిన బాలయ్యబాబు డైలాగ్ చెప్పింది. ఇలా పెళ్లి చేసుకోవడంపై సన్నీ స్పందించాడు. అలియా- రణబీర్ కపూర్ కలిసున్న ఫొటో ఒకటి తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టి శుభాకాంక్షలు చెప్పాడు. పోస్ట్ లో బై ఇంక వెళ్లొస్తా అనే గిఫ్ ఒకటి జత చేశాడు. సన్నీ లవ్ పోయిందంటూ నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. వీజే సన్నీ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#BBTeluguGrandFinale ante entertainment vishayam lo #ThaggedheLe . We and @iamnagarjuna are super excited for #FiveMuchFun
Today at 6 PM
#RanbirKapoor @aliaa08 @ssrajamouli @IamJagguBhai @NameisNani @iamRashmika @Sai_Pallavi92 @IamKrithiShetty @Naveenc212 @ThisIsDSP pic.twitter.com/5nIekEYLEK
— starmaa (@StarMaa) December 19, 2021
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.