ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. కానీ రవీందర్-మహాలక్ష్మి రేంజ్ లో మాత్రం ఫేమస్ కాలేకపోయారు. వీళ్ల పెళ్లి జరిగి నాలుగు నెలలు పైనే అయిపోయింది. వాళ్లు కూడా ఫ్యామిలీ లైఫ్ ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. పెళ్లి అయిన దగ్గర నుంచి వీళ్లకు సంబంధించి ఏదో ఓ ఫొటో బయటకొస్తూనే ఉంది. దానికి నెటిజన్స్ ఫిదా అవుతూనే ఉన్నారు. తెగ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక వీజే నుంచి నటిగా మారిన మహాలక్ష్మి, సీరియల్స్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అటు కెరీర్ , ఇటు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే భర్త రవీందర్ తో తీసుకున్న ఓ ఫొటో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో నిర్మాతగా గుర్తింపు తెచ్చకున్న రవీందర్ పలు సినిమాలు తీశాడు. ఆయన నిర్మించిన ‘విద్యుం వారై కతిరు’లో మహాలక్ష్మి నటించింది. అప్పుడు మొదలైన పరిచయం చాన్నాళ్లు కొనసాగింది. అలా వీరిద్దరూ ఈ ఏడాది సెప్టెంబరు 1న కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే.. రవీందర్-మహాలక్ష్మికి ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి. ఇప్పటికే మహాలక్ష్మికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇలా ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా ప్రేమ అనే బంధంతో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు.
ఇక పెళ్లి తర్వాత రవీందర్-మహాలక్ష్మి.. హనీమూన్, క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటివి జరుపుకొంటూనే ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా వీకెండ్ సందర్భంగా అలా బయటకెళ్లిన ఈ జంట.. చాలా ఆనందంగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భార్య మహాలక్ష్మితో తీసుకున్న ఓ బ్యూటీఫుల్ ఫొటోని రవీందర్ పోస్ట్ చేశాడు. తన జీవితానికి 8వ వండర్, తన భార్య అని అందమైన క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రవీందర్-మహాలక్ష్మి ఫొటో మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.