బాలనటులు హీరో హీరోయిన్లుగా మారాడం అనేది చాలా సాధారణ విషయం. గతంలో అనేక మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ హీరోహీరోయిన్లు గా మారి.. వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి, రాశి, మీనా మొదలైన వారు బాల నటులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం కొంతకాలనికి హీరోయిన్లు గా మారి ఇండస్ట్రీలో బాగా రాణించారు. అలానే విశ్వనటుడు కమల హాసన్ వంటి వారు కూడా చైల్డ్ ఆర్టిస్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత హీరోలుగా మారి.. స్టార్ డమ్ సంపాదించారు. ఆ కోవలోకి తాజాగా నటి అనిఖా సురేంద్రన్ చేరింది. ఈ పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. విశ్వాసం సినిమాలో అజిత్ , నయనతార కూతురుగా నటించిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తుపడతారు. అంతలా ఆ సినిమాతో అనిఖా సురేంద్రన్ పాపులర్ అయ్యింది.
అనిఖా సురేంద్రన్ 2007లో ‘చోటా ముంబై’ అనే మలయాళ సినిమాతో బాల నటిగా వెండి తెరకు పరిచయమైంది. ఆ తరువాత పలు మలయాళ సినిమాల్లో బాల నటిగా నటించి..మంచి గుర్తింపు సంపాదించింది. అలానే “ఎన్నై అరిందాల్” సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా పలు సినిమాలో బాల నటిగా నటించింది. ఈ క్రమంలో 2019లో అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాందించింది. ఆ సినిమాలో అజిత్, నయనతార కూతురిగా అనిఖా సురేంద్రన్ నటించింది. అలానే తెలుగులో సైతం ఘోస్ట్ సినిమాలో అదితి అనే చిన్నారి పాత్రలో నటించి.. ప్రేక్షకులను మెప్పించింది. ఇలా తమిళ, మలయాళం, తెలుగు భాషల్లో చాలా సినిమాలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు 18వ ఏటలోకి అడుగుపెట్టింది.
దీంతో ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలను చేసిన.. ఆ బ్యూటీ హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యా క్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అలా తన అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ….చిత్ర పరిశ్రమ దృష్టి తనపై పడేలా చేసుకోవడం విజయం సాధించింది. అంతేకాక జూనియర్ నయనతార అనే ముద్ర కూడా వేసుకుంది. ఇప్పటికే బాలనటిగా తెలుగు, మలయాళం భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా తెలుగులో బుట్టబొమ్మ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. హీరోయిన్ గా కూడా కెరీర్ న విజయవంతగా కొనసాగించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుత ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.