యాంకర్ విష్ణు ప్రియ.. ఒక యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత హీరోయిన్ గా చాలా ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఆమె చేసిన సినిమాలు అంతగా గుర్తింపు తీసుకురాలేదనే చెప్పాలి. ఆ తర్వాత బుల్లితెర వైపు అడుగులు వేసి.. బిజీ యాంకర్ గా మారింది. ప్రస్తుతం మళ్లీ ఆర్టిస్టుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ కాస్త బిజీగానే ఉంటోంది. నిజానికి బుల్లితెరకు దూరంగా ఉంటూ.. యాక్టింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. విష్ణుప్రియకు దైవ చింతన కూడా ఎక్కువే అని చెప్పాలి. ఎప్పుడూ ఏదొక మెసేజ్ లు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు, ఫాలోవర్స్ కు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడూ ఏదొక పోస్టు పెడుతూ తన అభిమానులను అలరిస్తుంటుంది. అయితే విష్ణుప్రియ చేసే ఎక్కువ పోస్టులు డాన్సింగ్ వీడియోలే అని చెప్పొచ్చు. విష్ణుప్రియ ఎప్పుడూ కాస్త బోల్డ్ ఫొటోస్, డాన్సింగ్ వీడియోలు పోస్ట్ చేస్తుంటుందని అందరికీ తెలిసిందే.
అలా ఎందుకు చేస్తుందంటే.. బోల్డ్ పాత్రల్లో కూడా నటించగల టాలెంట్ తనకుందని నిరూపించే ప్రయత్నం అని కొందరు చెబుతుంటారు. తాజాగా బాద్ షా మ్యూజిక్ కు డాన్స్ ఇరగదీసింది. షర్ట్ పైకి ఫోల్డ్ చేసి.. నైట్ పాంట్ పై కూలింగ్ గ్లాసెస్ పెట్టి విష్ణు ప్రియ వేసిన స్టెప్పులకు ఫాలోవర్స్ కు ఫీవర్ వచ్చిందనే చెప్పాలి. విష్ణు ప్రియ వైరల్ డాన్సింగ్ వీడియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.