ప్రస్తుతం దేశం వ్యాప్తంగా ఎక్కడ చూసిన విక్రమ్ మూవీ సందడే. విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలు పెట్టింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాలో స్టార్ హీరో సూర్య క్యామియో రోల్ చేశారు. అయితే.. కమల్ హాసన్ సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉండేసరికి సినిమాకి మంచి ప్లస్ అయింది. ఇక ఈ సినిమా విడుదలై రెండు వారాలు దాటుతున్న ఇంకా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ విక్రమ్ మూవీ దూసుకెళ్తుంది. తాజాగా వసూల విషయంలో బాహుబలి-2 రికార్డును విక్రమ్ మూవీ బద్దల కొట్టింది.
కమలహాసన్ భారతీయ సినిమా లెజెండ్ నటులలో ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించడమే కాకుండా 20 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ రికార్డులను సైతం సృష్టించారు. 60 ఏళ్ళ వయస్సులో కూడా కమల్ హాసన్ ఎంతో హుషారుగా నటిస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల చాలా కాలం పాటు ఒక్క మంచి హిట్ సినిమా లేక సతమతమవుతున్న కమల్ కి విక్రమ మంచి బూస్ట్ ఇచ్చింది. అనేక రికార్డులు చేరిపేస్తూ దూసుకెళ్తుంది.
ఇదీ చదవండి: సుధీర్ టీమ్ విడిపోవడం వెనుక అంత రచ్చ జరిగిందా?బాహుబలి-2 వచ్చి ఇప్పటికే దాదాపు ఐదేళ్లు అవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో వసూలు సాధించిందో అందరికి తెలుసు. అన్ని ప్రాంతాల నుంచి రికార్డు స్థాయిలో వసూలు రాబట్టింది. సౌత్ లోని అన్ని ఇండస్ట్రీలో వసూలు సునామి సృష్టించింది. ఇప్పటికి బాహుబలి-2 రికార్డులు ఎవరు కొట్టలేకపోయారు.అయితే ఈచిత్రం తమిళనాడులో మొత్తంగా దాదాపు రూ.155 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఆతర్వాత ఇళయదళపతి విజయ్ నటించిన “బిగిల్” చిత్రం రూ.141 కోట్లు సంపాందించింది. అయితే తాజాగా విక్రమ్ రాబట్టుతున్న వసూల్ చూస్తుంటే బిగిల్ చిత్రం కాదు ఏకంగా బాహుబలి-2 రికార్డునే బద్దల కొట్టనుంది. గత ఆదివారం వరకే విక్రమ్ మూవీ రూ.130 కోట్లు రాబట్టినట్లు తమిళనాడులో టాక్ వినిపిస్తోంది.
ఇదీ చదవండి: ఇప్పటికీ నేను ఏం కొన్నా.. OTP మా అమ్మకి వెళ్తుంది: సాయిపల్లవి
ఇంకా అన్ని థియేటర్లు విజయవంతగా కొనసాగుతూ.. రాకెట్ లా దూసుకెళ్తుంది. అయితే ఈ రేంజ్ లో వసూలు సాధిస్తోన్న విక్రమ్.. బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టేందుకు ఎంతో సమయం పట్టదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఆల్రెడీ బాహులి-2 రికార్డులను విక్రమ్ మూవీ బద్దలు కొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ ఆర్ మూవీని బీట్ చేస్తూ తమిళనాడులో ఏడాదిలోనే అత్యధిక వసూలు సాధించిన మూడో చిత్రంలో విక్రమ్ నిలించిది.అన్ని రికార్డులను దాటుకుంటూ తమిళనాడులో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా విక్రమ్ నిలుస్తుందేమే చూడాలి
#Vikram has crossed #KGFChapter2 TN Gross to emerge 2022 TN No.2.. 🔥
Today, it will cross #Valimai to emerge 2022 No.1 by tomorrow..
— Ramesh Bala (@rameshlaus) June 12, 2022
Top 7 TN gross/share of 2022#Valimai#KGFChapter2#Vikram*#RRRMovie#ET#Don#Beast
— Manobala Vijayabalan (@ManobalaV) June 12, 2022