బాయ్‌కాట్.. ప్రస్తుతం ఈ పేరు చెబితే అన్ని పరిశ్రమలు దడుసుకుంటున్నాయి. ఇక బాలీవుడ్ అయితే.. గజ గజ వణికిపోతుంది. బాయ్‌కాట్ ట్రెండ్ దెబ్బకు బాలీవుడ్‌లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాను బాయ్‌కాట్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మొదలు.. తాజాగా రిలీజైన దోబారా సినిమా వరకు బాయ్‌కాట్ ట్రెండ్‌కు బలైనవే. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఈ ట్రెండ్ ప్రాంరభం కాలేదు.. సంతోషం అనుకుంటున్న సమయంలో రౌడీ హీరో లైగర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పిలపునిచ్చారు ట్రోలర్స్. ప్రస్తుతం సోషయల్ మీడియాలో లైగర్‌పై బాయ్‌కాట్, వి సపోర్ట్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో తన మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ వస్తోన్న ట్రోలర్స్‌పై రౌడీ హీరో విజయ్ స్పందించారు. సినిమా కథ ఏంటో.. దాని వివరాలు ఏంటో తెలియకుండానే బాయ్‌కాట్ చేస్తారా.. ఏది ఎదురొచ్చినా కొట్లాడమే చేస్తాను అంటూ ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు విజయ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
బాయ్‌కాట్ లైగర్‌పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘‘ఈ సినిమాను మూడేళ్ల కింద ప్రారంభించాం. అప్పటికి ఈ బాయ్‌కాట్ గొడవలు లేవు. దేశవ్యాప్తంగా ఈ సినిమాలను రిలీజ్ చేయాలని భావించినప్పుడు మాకు కరణ్ జోహార్ కనిపించారు. ఆయన బాహుబలి సినిమాను అక్కడి ప్రేక్షకులకు చేరువ చేయ్యడంలో సక్సెస్ అయ్యారు. అందుకే లైగర్ బాలీవుడ్ రిలీజ్ బాధ్యతలు ఆయనకు అప్పజెప్పాం’’ అని తెలిపాడు.
‘‘ఇక బాలీవుడ్‌లో ఏం జరిగిందో మాకు తెలియదు. మేం కరెక్ట్‌గానే ఉన్నాం. నేను, పూరి, ఛార్మి అంతా ఇక్కడి వాళ్లమే. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాం. ఇప్పుడు మేం రిలీజ్ చేసుకోకుండా ఇంట్లో కూర్చోవాలా.. ప్రమోషన్స్‌లో భాగంగా ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమ కురిపిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం మే ఈ సినిమా చేశాం. మన వాళ్లు మనకు ఉన్నంత సేపు ఎవరికి భయపడాల్సిన పనిలేదు. మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. ఏది ఎదురొచ్చినా కొట్లాడమే. ఈ దేశం, ఈ ప్రజల కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే అన్నారు. విజయ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Manam Correct unnapudu
Mana Dharmam manam chesinapudu
Evvadi maata vinedhe ledu.
Kotladudham 🔥#Liger— Vijay Deverakonda (@TheDeverakonda) August 20, 2022