Vignesh Shivan: కొన్ని సంవత్సరాల డేటింగ్ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు లేడీ సూపర్‌స్టార్ నయన తార, దర్శకుడు విఘ్నేష్ శివన్. వీరి పెళ్లి జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో నయన తార కట్టుకున్న ఎర్ర చీర, చేసుకున్న అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నయన తార పెళ్లి గెటప్‌ను ఫాలో అవుతూ ఎర్ర చీర, అలంకరణతో చాలా మంది అమ్మాయిలు ఫొటోలు, వీడియో తీసుకున్నారు. తాజాగా, ప్రముఖ తమిళ నటి హారతి కూడా నయన తార పెళ్లి అలంకరణను ఫాలో అయ్యారు. ఎర్ర చీరలో దర్శనమిచ్చారు. ఎర్ర చీరలో దిగిన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ ఏమి హింస ఇది.. ఊహ వర్సెస్ వాస్తవం’’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోపై నయన తార భర్త విఘ్నేష్ శివన్ స్పందించారు.
ఆ చీరలో హారతి.. నయన తార కంటే అందంగా ఉంది అని అర్థం వచ్చేలా.. ‘‘ నువ్వు ఇంకా అందంగా ఉన్నావు డియర్ హారతి ’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ట్వీట్లపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నయన్ ఆ ట్వీట్ చూడక ముందే నువ్వు డిలీట్ చెయ్యి విఘ్నేష్’’.. ‘‘నయన తార ఆ చీరపై స్పందించాలి. నువ్వు కాదు!’’.. ‘‘ నయన్ ఆ ట్వీట్ చూసినపుడు ఉంటది నీకు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, హారతి అలంకరణపై విఘ్నేష్ శివన్ స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
என்ன கொடுமை இது 😆😂Expectation vs reality pic.twitter.com/MQxiaS4hib
— Actress Harathi (@harathi_hahaha) August 11, 2022
You are more beautiful dear Harathi ☺️☺️😍😍❤️❤️❤️🥰🥰🥰💐💐💐💐💐 https://t.co/VIieOSn6H4
— Vignesh Shivan (@VigneshShivN) August 12, 2022
ఇవి కూడా చదవండి : Nayan- Vignesh: సెకండ్ హనీమూన్ కోసం స్పెయిన్ వెళ్లిన నయనతార- విఘ్నేశ్ దంపతులు!