ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై గళం విప్పుతూ ధైర్యంగా మాట్లాడుతున్నారు హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు. దీని కారణంగా ఇండస్ట్రీలో మోసపోయిన హీరోయిన్స్ తో పాటు లైంగికంగా వేధింపులకు గురైన ఆర్టిస్టులు సైతం.. తమకు జరిగిన అన్యాయాల గురించి ఓపెన్ అవుతున్నారు. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
చిత్రపరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై గళం విప్పుతూ ధైర్యంగా మాట్లాడుతున్నారు హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు. దీని కారణంగా ఇండస్ట్రీలో మోసపోయిన హీరోయిన్స్ తో పాటు లైంగికంగా వేధింపులకు గురైన ఆర్టిస్టులు సైతం.. తమకు జరిగిన అన్యాయాల గురించి ఓపెన్ అవుతున్నారు. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనతో ఓ డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నాలు చేశాడని.. తాను తెలివిగా అతని నుండి తప్పించుకున్నానని విద్యాబాలన్ తెలిపింది. ప్రెజెంట్ కాస్టింగ్ కౌచ్ గురించి విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి.
ఈ క్రమంలో విద్యాబాలన్ మాట్లాడుతూ.. “అదృష్టం కొద్దీ నేను క్యాస్టింగ్ కౌచ్ ఉచ్చులో పడలేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే ఇక్కడి పరిస్థితుల గురించి చాలామంది చెప్పారు. అందుకే నా పేరెంట్స్ నన్ను సినిమాల్లోకి పంపడానికి భయపడ్డారు. ఇప్పటిదాకా నాకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురు కాలేదు. కానీ, అయితే గతంలో ఒకసారి ఓ దర్శకుడి ఆ బారి నుంచి తప్పించుకున్నాను. నా లైఫ్ లో ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఓ యాడ్ షూట్ కోసం చెన్నైకి వెళ్తే.. అక్కడి దర్శకుడు నాతో తేడాగా బిహేవ్ చేయాలని చూశాడు. స్క్రిప్ట్ గురించి మాట్లాడేందుకు కాఫీ షాప్ కి వెళ్తే.. కాసేపయ్యాక మిగతా విషయాలు రూమ్ లో మాట్లాడుకుందాం అన్నాడు.
అప్పుడు నాతో ఎవరు లేరు. భయపడుతూ రూమ్ వద్దకు వెళ్ళాక.. డోర్స్ ఓపెన్ చేసి ఉంచి.. మాట్లాడుకుందాం అన్నాను. దాంతో అతనికి ఏం చేయాలో తోచక రూమ్ నుండి వెళ్లిపోయాడు. ఆ టైంలో నాకు ఎవరు సపోర్ట్ లేరు. నా తెలివితేటలతో నన్ను నేను కాపాడుకున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విద్యాబాలన్ మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారగా, ఆమెను ఇబ్బంది పెట్టబోయిన డైరెక్టర్ ఎవరా? అని ఆలోచనలో పడ్డారు నెటిజన్స్, ఫ్యాన్స్. ఇక డర్టీ పిక్చర్ మూవీతో ఇండియా వైడ్ మంచి గుర్తింపు సంపాదించుకున్న విద్యా.. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు. మహానాయకుడు సినిమాలలో నటించింది. మరి కాస్టింగ్ కౌచ్ గురించి విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.