కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. శాండల్‌వుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సీనియర్ దర్శకుడు కన్నుమూశారు.
కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. శాండల్‌వుడ్ సీనియర్ దర్శకుడు ఎస్కే భగవాన్ (90) సోమవారం బెంగళూరులో కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా సతమతమవుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రవీంద్ర కళాక్షేత్రలో ఉంచనున్నారు. కన్నడ దిగ్గజ నటుడు రాజ్‌కుమార్‌కు మర్చిపోలేని పలు బ్లాక్ బస్టర్ సినిమాలను ఎస్కే భగవాన్ అందించారు. మరో దర్శకుడు దొరైతో కలసి భగవాన్ 27 చిత్రాలను తెరకెక్కించారు. దొరై–భగవాన్ ద్వయం కన్నడ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో వచ్చిన సినిమాల్లో దాదాపుగా మెజారిటీ మూవీస్ హిట్లుగా నిలిచాయి. వీరిలో దొరై 2000 సంవత్సరంలో కన్నుమూశారు. ఇక, ఎస్కే భగవాన్ మృతిపై కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. బొమ్మైతో పాటు పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీలు భగవాన్ మృతికి సంతాపం తెలియజేశారు.
Kannada film director SK Bhagavan passes away in Bengaluru.
“I was very saddened to hear the news of renowned director of Kannada film industry SK Bhagavan’s death. I pray that God gives strength to his family to bear this pain,” tweets Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/tzU7vLBkS8
— ANI (@ANI) February 20, 2023