గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు వారి బంధువులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు హిషామ్ అహ్మద్ తాజుద్దీన్ ఈరోజు షా ఆలం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు.
గత కొంత కాలంగా హిషామ్ అహ్మద్ తాజుద్దీన్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో షా ఆలం ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం ఆయన కూతురు అఖిలా మొహమ్మద్ హిషామ్ సోషల్ మాద్యమం ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ‘మా నాన్న హిషామ్ అహ్మద్ తాజుద్దీన్ నిద్రలోనే కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని అకీలా తన పోస్ట్‌లో పేర్కొంది.
సివిల్ సర్వెంట్ గా ఉన్న ఆయన నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 1980 లో ఆయన కెరీర్ ఆరంభమైంది.. టెలివిజన్ సీరియల్స్, పలు చలన చిత్రాల్లో నటించారు. ఫెహ్ సోఫియా, వైరా అంగ్కాసా, హన్నీ, పుటేరా మూవీలు హిషామ్ అహ్మద్ తాజుద్దీన్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. హిషామ్ అహ్మద్ తాజుద్దీన్ మరణం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.