కమల్ హాసన్ ‘విక్రమ్’ చూసిన తర్వాత.. యాక్షన్ మూవీ లవర్స్ కి అనిపించిన ఒకే ఒక్క మాట ‘వావ్’. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సరైనవి పడితే థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. సరిగ్గా అలాంటి మూవీనే ఇది. దీన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు చాలామంది.. టాలీవుడ్ లో ఈ తరహా యాక్షన్ మూవీ.. ఏ హీరో అయినా చేస్తే బాగుంటుందని తెగ ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్లందరి కోరికలు చాలా త్వరగా నెరివేరిపోయినట్లు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన లుక్స్, గ్లింప్స్ అప్పుడే యూట్యూబ్ లో వైరల్ గా మారిపోయాయి.
ఇక విషయానికొస్తే.. విక్టరీ వెంకటేష్ అనగానే కంప్లీట్ యాక్టర్ గుర్తొస్తారు. ఫ్యామిలీ, ఎమోషనల్, రా రస్టిక్, డ్రామా, యాక్షన్.. ఇలా ఏ జానర్ తీసుకున్నా సరే పూర్తి న్యాయం చేస్తారు. తన కెరీర్ లో చాలా రీమేక్స్ చేశారు కానీ వాటిని ఎప్పుడూ చూసినా సరే బోర్ కొట్టవు. రీమేక్ అని అస్సలు అనిపించవ్. అలానే వెంకటేష్.. తనకు ఏదైనా కథ నచ్చితేనే చేస్తారు. కుదరకపోతే ఎన్నాళ్లయినా సరే వెయిట్ చేస్తారు తప్పితే ఏదో తొందరపడి మాత్రం అస్సలు కమిట్ అవ్వరు. ఇప్పుడు అలా తన కెరీర్ లోనే ప్రతిష్ఠాత్మకమైన 75వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు.
‘సైంధవ’ పేరుతో తీస్తున్న ఈ సినిమాలో వెంకీ రగ్గ్ డ్ లుక్ తో కనిపిస్తున్నారు. చేతిలో గన్, వెనకాల కార్ బ్లాస్ట్.. ఇలా జస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎక్స్ పెక్టేషన్స్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. దానికి తోడు రీసెంట్ గానే ‘హిట్ 2’ మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించిన శైలేష్ కొలను.. ఈ మూవీకి డైరెక్టర్ కావడంతో అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ పోస్టర్ చూస్తున్న ఫ్యాన్స్, ప్రేక్షకులు కూడా త్వరలో మరో అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని థియేటర్లలో ఎక్స్ పీరియెన్స్ చేయబోతున్నామని అప్పుడే సంబరపడిపోతున్నారు. అయితే ‘సైంధవ్’ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇందులో వెంకీ రోల్ ఎలా ఉండబోతుందనేది త్వరలో బయటకొచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మరి వెంకీమామ కొత్త సినిమా లుక్ మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.