మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే గని, ఎఫ్ 3 వంటి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా తాజాగా మరోసినిమాకు సిగ్నల్ ఇచ్చాడు వరుణ్. నేడు కొత్త సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా తండ్రి నాగబాబు క్లాప్ కొట్టగా తల్లి కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
ఈ సినిమాకు నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. కాగా వరుణ్ సరసన ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.