వరలక్ష్మి శరత్ కుమార్.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా పలు బాషల్లో చిత్రాలు చేస్తూ.. బిజీగా ఉంది. ఇక టాలీవుడ్ లో స్టైలిష్ లేడీ విలన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఓ కార్యక్రమంలో కోలీవుడ్ పరువుతీసేలా వ్యాఖ్యలు చేసింది జయమ్మ.
ఇండస్ట్రీలో మంచి నటుడిగా, నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. దానికి ఎంతో కష్టపడాలి. అయితే ఎంత కష్టపడ్డాగానీ మంచి నటిగా గుర్తింపు వచ్చినా, కొందరికి మాత్రం అవకాశాలు రావు. ప్రస్తుతం నేను ఇదే పరిస్థితిలో ఉన్నానని అంటోంది స్టార్ హీరోయిన్. మంచి నటిగా ప్రస్తుతం ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ తనకు అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ బయపడుతున్నారని ఈ నటి పేర్కొంది. అందుకే నాకు ఆ ఇండస్ట్రీలో నటిగా ఛాన్స్ లు రావట్లేదని చెప్పుకొచ్చింది. అదీకాక టాలీవుడ్ లో పారితోషికాలు కరెక్టగా ఇస్తారని, గౌరవం కూడా ఇస్తారని పేర్కొంది.
వరలక్ష్మి శరత్ కుమార్.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా పలు బాషల్లో చిత్రాలు చేస్తూ.. బిజీగా ఉంది. ఇక టాలీవుడ్ లో స్టైలిష్ లేడీ విలన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్ గా తమిళంలో ‘కొండ్రాల్ పావం’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. వరలక్ష్మికి జంటగా సంతోష్ ప్రతాప్ నటిస్తుండగా.. దయాళ్ పద్మనాభన్ దర్శకత్వంతో పాటుగా సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా తెలుగులోకి డబ్బింగ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వరలక్ష్మి మాట్లాడుతూ..” చాలా సంవత్సరాల తర్వాత తమిళంలో నటిస్తున్నాను. డైరెక్టర్ నాకు కన్నడ చిత్రం చూపించగానే నేను ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాన్ను. అంతలా నాకు ఈ సినిమా నచ్చింది. ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్, అద్భుతంగా ఉంటుందని” ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తున్నారు ఎందుకు అని ప్రశ్నించగా.. తనకు తమిళంలో అవకాశాలు రావడం లేదని స్పష్టం చేశారు వరలక్ష్మి శరత్ కుమార్. 2011లో పోడాపోడీ చిత్రం ద్వారా తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయ్యానని, 9 ఏళ్లు ఇక్కడ నటించినా గానీ క్రేజ్ తెలుగులో ఒక్క క్రాక్ సినిమాతో వచ్చిందని వరలక్ష్మి అన్నారు.
ఈ క్రమంలోనే నేను పాత్రల్లో వైవిధ్యం చూపినప్పటికీ నాకు తమిళంలో అవకాశాలు ఇవ్వడం లేదని వరలక్ష్మి వాపోయారు. ఇక నన్ను చూసి మేకర్స్ భయపడుతున్నారో, లేక ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారో తెలియడం లేదని వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అదీకాక టాలీవుడ్ లో కరెక్ట్ టైమ్ కు రెమ్యూనరేషన్ తో పాటుగా, గౌరవం ఇస్తున్నారని ఆమె తెలిపారు. అయితే తమిళంలో పారితోషికాలు, గౌరవాలు ఇవ్వట్లేదా అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.