తెలుగు చలనచిత్ర రంగంలో స్టార్ వార్ ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ఒక హీరోతో ఇంకో హీరో కంప్యారిజన్స్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ.., తమ హీరోల సినిమాలు క్రియేట్ చేసే రికార్దుల విషయంలో మాత్రం ఫ్యాన్స్ తగ్గేదే లే అంటున్నారు. దీంతో.., ఇప్పుడు టీ ఆర్ పీ రేటింగ్స్ విషయంలో కూడా కొత్త రికార్డ్స్ పుట్టుకొస్తున్నాయి. ఏ కొత్త సినిమా వెండితెరపై విడుదల అయినా.., ఆ సినిమా టీ ఆర్ పీని.. తమ హీరో సినిమా టీ ఆర్ పీ దాటి వచ్చిందా లేదా అని ఫ్యాన్స్ లెక్కలు కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మహేశ్ బాబు శ్రీమంతుడు, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాల మధ్య పోటీ మొదలయింది.
శ్రీమంతుడు, వకీల్ సాబ్ రెండు చిత్రాల శాటిలైట్ రైట్స్ ఒకే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ వద్ద ఉన్నాయి. ఇక ‘వకీల్ సాబ్’ మూవీ ఇటీవల ఆ టెలివిజన్ ఛానెల్ లో ప్రసారం అయ్యింది. అయితే.., ఇప్పుడు దీనికి సంబంధించిన టీ ఆర్ పీ రేటింగ్స్ వచ్చాయి. వకీల్ సాబ్‌కు 19.12 రేటింగ్స్ వచ్చాయి. నిజానికి ఇది మంచి రేటింగ్. కానీ.., అదే ఛానెల్ ఇది వరకు ప్రసారం అయిన మహేష్ బాబు శ్రీమంతుడు 22.54 రేటింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఇదే అసలు రచ్చకి కారణం అయ్యింది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మహేశ్ బాబు పాత సినిమా రికార్డ్ ని బీట్ చేయలేకపోయింది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా హంగామా చేస్తున్నారు.
నిజానికి శ్రీమంతుడు తర్వాత స్థానంలో అల్లు అర్జున్ డీజే 21.7 రేటింగ్స్‌తో రెండవ స్థానంలో ఉంది. విజయ్ దేవరకొండ గీతా గోవిందం 20.8తో మూడవ స్థానంలో ఉండగా.. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నాలుగవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన వకీల్ సాబ్ కి ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు వచ్చింది అంటే పవన్ ఫ్యాన్స్ ప్రత్యేక కారణం వినిపిస్తున్నారు.
వకీల్ సాబ్ ఇప్పటికే ఓటీటీలో అందరికీ అందుబాటులో ఉంది. కానీ.., టాప్ లో ఉన్న మూడు సినిమాలు టెలికాస్ట్ అయ్యే సరికి ఓటీటీల జోరు లేదు. కాబట్టే.. వకీల్ సాబ్ మూవీ శ్రీమంతుడి రేటింగ్స్ బీట్ చేయలేకపోయిందని పవన్ ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.