టాలీవుడ్ లో ఉన్న క్యూట్, అడోరబుల్ కపుల్స్ లిస్ట్ లో రాంచరణ్– ఉపాసన ముందుటారు. వీరి వివాహం జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ పదేళ్లలో వీరి దాంపత్య జీవితంలో ఎన్నో మధుర క్షణాలు ఉన్నాయి. కానీ, వీరికి చాలా సందర్భాల్లో అటు ఫ్యాన్స్, బంధువులు, కుటుంబసభ్యుల నుంచి కూడా ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. తాజాగా ఆ ప్రశ్నను మెగా కోడలు ఉపాసన ఇటీవల ఓ బహిరంగ వేదికపై సద్గురు ముందు ఉంచారు. ఆ ప్రశ్నకు సద్గురు తనదైనశైలిలో సమాధానం చెప్పారు.
సద్గురుని ఇంటర్వ్యూ చేసే సందర్భంలో.. “ మాకు పెళ్లై పదేళ్లు అయ్యింది. నాకు నా లైఫ్ ఎంతో నచ్చింది. కానీ, చాలా మంది నన్ను RRR గురించి అడుగుతుంటారు. RRR అంటే రిలేషన్, రీప్రొడ్యూస్, రోల్ ఇన్ లైఫ్.. వాటి గురించి నన్ను ఎందుకు అడుగుతుంటారు?” అంటూ ఉపాసన- సద్గురుని ప్రశ్నించారు. అందుకు సద్గురు కూడా తనదైనశైలిలో సమాధానమిచ్చారు.
“ఈ కాలంలో పిల్లల్ని కనకుండా ఉండే వారికి నేను అవార్డు ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఈ తరం వాళ్లు ఎవరైనా అలా ఉంటే నేను వారికి అవార్డు ఇస్తాను. ఒకవేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే.. నిన్ను పిల్లల్ని కనమని చెప్పేవాడిని. ఎందుకంటే భూమ్మీద పులులు చాలా తక్కువ ఉన్నాయి. కానీ, నువ్వు మనిషివి.. భూమ్మీద ఇప్పటికే మనుషులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పని ఉంటే పిల్లల్ని కనే ఆలోచన ఉండదు. పని లేకుండా ఖాళీగా ఉండే వారిని ఆ హార్మోన్లు ఆగనివ్వవు” అంటూ సద్గురు సమాధానం చెప్పారు.
ఆ సమాధానం విన్నాక ఉపాసన.. “మీరు ఇలా చెప్పారు కదా.. చూడండి కాసేపట్లో మీకు మా అమ్మ, అత్తల నుంచి ఫోన్లు వస్తాయి చూడండి” అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు. అందుకు సద్గురు నాకు అలాంటి అత్త, అమ్మల నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఉపాసన- సద్గురుల ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. సద్గురు చెప్పిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.