న్యూమరాలజీ ప్రకారం కొంతమందికి కొన్ని నంబర్లు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు ఉంటాయి. అలానే కొంతమందికి కొన్ని సంఖ్యలు కలిసి రావు. తారకరత్న విషయంలో కూడా ఒక సంఖ్య శాపంగా మారిందేమో అనిపిస్తుంది. ఆ సంఖ్య ఏంటంటే?
సినీ నటుడు నందమూరి తారకరత్న (39) శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తారకరత్న మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తారకరత్న మరణం నందమూరి కుటుంబ సభ్యులకు తీరని లోటు. ఆయన మరణంపై అభిమానులు, టీడీపీ నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నందమూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తారకరత్నకు సంబంధించి ఒక సెంటిమెంట్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు చాలా ఎక్కువ. సెంటిమెంట్స్ లో కలిసొచ్చేవి, కలిసిరానివి రెండూ ఉంటాయి. సెంటిమెంట్స్ ని నమ్మేవారు రెండిటినీ నమ్ముతారు. తారకరత్న విషయంలో కూడా ఓ సెంటిమెంట్ ఉందని అర్థమవుతుంది. న్యూమరాలజీని అనుసరించే వారు ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని నంబర్లు కొంతమందికి కలిసి వస్తే కొన్ని నంబర్లు కలిసి రావు. అలా తారకరత్న విషయంలో కలిసి రాని అంకె ఒకటి ఉంది. అదే నంబర్ 9. 2001లో తారకరత్న ఇండస్ట్రీకి అప్పుడే పరిచయం అవుతున్న సమయంలో ఒకేరోజు మొత్తం 9 సినిమాలకు సంతకం చేశారు. ఒకేరోజు 9 సినిమాలకు సంతకం చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఘనత తారకరత్నది. అయితే వీటిలో 6 సినిమాలు షూటింగ్ కి నోచుకోలేదు. మిగతా 3 సినిమాల్లో ఒకటి ఒకటో నెంబర్ కుర్రాడు, రెండవది యువరత్న కాగా మూడవది తారక్.
తారకరత్న సంతకం చేసిన 9 సినిమాల్లో 6 సినిమాలు ఆగిపోవడం తారకరత్నకు కలిసి రాలేదని చెప్పుకోవాలి. ఆ సినిమాలు షూటింగ్ జరిగి విడుదలై ఉంటే తారకరత్న కెరీర్ వేరేలా ఉండేదేమో. ఈ ఒక్క విషయంలోనే కాదు. కుప్పం పర్యటనలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన తేదీని కలిపితే 9 రావడం, మరణించిన తేదీని కలిపితే 9 రావడం చూస్తుంటే 9 అంకె కలిసి రాలేదేమో అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గత నెల 27న హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 27వ తేదీలో 2,7 కలిపితే 9 వస్తుంది. ఆ తర్వాత 23 రోజులు చికిత్స పొందిన తారకరత్న ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరి 18లో 1,8 నంబర్లను కలిపితే 9 వస్తుంది. ఆ రకంగా తారకరత్నకు 9వ అంకె అస్సలు కలిసి రాలేదని అనిపిస్తుంది. తారకరత్న ఇలా చిన్న వయసులోనే కాలం చెందడం జీర్ణించుకోలేని విషయం. ఆయనకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని కోరుకుందాం. ఓం శాంతి.