సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సాహితీ గగనాన ఆయన మకుఠం లేని మహారాజు. కవులు అందరికీ పాటపై పట్టు చిక్కితే ఆయనకే పాటే పట్టుబడింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలకి సిరివెన్నెల రాసే పాటలు ప్రాణంగా నిలిస్తుంటాయి. చాలా సినిమాలను సిరివెన్నెల ఇలానే తన పాటతో కాపాడారు. దీనికి ముఖ్య ఉదాహరణగా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని అనే పాటని చెప్పుకోవచ్చు.
1997లో విడుదల సింధూరం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కృష్ణవంశీ ఆ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక సింధూరం సినిమా గురించి చెప్పుకోగానే ముందుగా గుర్తుకి వచ్చేది అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నిపాటే. కానీ.., మీకు తెలుసా? ముందుగా సినిమాలో ఈ పాట లేదట. కానీ.., కృష్ణవంశీ అంటే సిరివెన్నెల గారికి చాలా ఇష్టం. ఆ ఇష్టంతో సింధూరం ప్రివ్యూకి వెళ్లారు సీతారామశాస్త్రి. సినిమా అంతా అయ్యాక ఆయనలో ఏదో అసంతృప్తి.
సినిమాలో ఓ బలమైన విషయాన్ని చెప్పి, పాటలలో ఆ బలం లేకుంటే ఎలా అన్న ఆలోచన సిరివెన్నెలలో వచ్చింది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న దర్శకుడు కృష్ణవంశీకి చెప్పాడు. సమయం లేదు కదా? గురువు గారు అన్నారు కృష్ణవంశీ. కానీ.. సిరివెన్నెల అక్కడిక్కడే పక్కనే ఉన్న ఒక సిగరెట్ డబ్బాని అందుకుని దానిపై అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా అంటూ రాసుకుంటూ వెళ్లిపోయారు. అద్భుతమైన పాట. పక్క రోజు ట్యూన్ అయిపోయింది. ఆ మరుసటి రోజు సినిమాలో పెట్టేశారు. సింధూరం సినిమా రిలీజ్ అయ్యాక ఆ మొత్తం సినిమాకి ఒక పూర్తి అర్ధాన్ని ఇచ్చిన పాటగా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా నిలిచిపోయింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.