ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే ఎమోషన్, అసహనానికి గురి కావడం జరుగుతుంది. ఈ క్షణంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పపడుతున్నారు.
పసిపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు.. చిన్నపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలని తల్లిదండ్రులకు చెబుతుంటారు. పసిపిల్లలను చూస్తుంటే ఎలాంటివారికైనా ముద్దొస్తుంది. కానీ ఓ నటి భర్త మాత్రం దారుణానికి వడిగట్టాడు.. 14 నెలల చిన్నారిని నేలకేసి రక్తం వచ్చేలా కొట్టాడు. నటి అబార్షన్ చేయించుకోలేదన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు టాక్ వినిపిస్తుంది. చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ ఘటన మహరాష్ట్ర ముంబాయిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే
బుల్లితెరపై అదాలత్, సి.ఐ.డి, క్రైమ్ అలర్డ్ వంటి షోలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది నటి చంద్రికా సాహా. గతంలో వివాహం చేసుకొని భర్తకు విడాకులు ఇచ్చింది. 2020 లో వ్యాపారవేత్త అయిన అమన్ మిశ్రాతో ప్రేమలో పడింది. ఈ జంట కొంత కాలం రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రికా సాహా గర్భం దాల్చింది. ఇప్పుడే పిల్లలు వద్దంటూ అమన్.. చంద్రికా సాహా ను అబార్షన్ చేయించుకోవాలని కోరాడు.. కానీ దానికి చంద్రిక నో చెప్పింది. ఈ విషయంలోనే కొంతకాలంగా ఇద్దరి మద్య గొడవలు జరుగుతూ వచ్చాయి. గత నెల అమన్ మిశ్రా, చంద్రిక వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారి బాబు వయసు 14 నెలలు. మొదటి నుంచి బాబు అంటే ఇష్టం లేని అమన్ మిశ్రా తన రాక్షస బుద్దిని బయటపెట్టాడు.
కిచెన్ లో తనకు కాస్త పని ఉందని.. బాబును ఆడిపించాల్సిందిగా అమన్ కి చెప్పానని.. అమన్ బాబుని తీసుకొని బెడ్ రూమ్ కి వెళ్లాడని.. కొద్ది సేపటి తర్వాత బాబు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడని.. వెంటనే తాను బెడ్ రూమ్ లోకి వెళ్లి చూడగా బాబు శరీరంపై గాయాలు ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించానని చెప్పింది. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉందని తెలిపింది చంద్రిక. అయితే తన భర్తపై అనుమానం రావడంతో సీసీ ఫుటేజ్ చూసి షాక్ తిన్నానని.. తన 14 నెలల చిన్నారిని అమన్ మిశ్రా తలకిందులుగా వేలాడదీసి నేలకేసి మూడు సార్లు కొట్టాడని.. తన బిడ్డను చంపడానికి ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది చంద్రిక. ఈ వీడియో ఆధారంగా చంద్రిక సాహా భర్త అమన్ మిశ్రాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.