దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ ‘RRR’. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ.. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చోసుకుంది. అన్ని ప్రాంతాల నుంచి భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ చిత్రంపై చాలామంది ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపించారు. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా, ఏపీ సీఎం జగన్ పై ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్ ఆర్ ఆర్ చిత్రం విడుదల ముందు వరకు ఏపీలో సినిమాల విషయంలో పరిస్థితులు ఇప్పటికి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే టికెట్లు అమ్మాలని, బెనిఫిట్ షోలు వేయకుడదని, రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలని, పలు రకాల రూల్స్ ఏపీ ప్రభుత్వం పెట్టింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. నిర్మాతలకు, సినీ పరిశ్రమకు నష్టం కలిగించే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. ఈ క్రమంలో RRR మూవీ రిలీజ్ కంటే కొన్ని రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ వంటి కొందరు సినీ ప్రముఖులు వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్ తో చర్చించారు.
అనంతరం ఇటీవల విడుదలైన RRR సినిమాకు టికెట్ల రేటు విషయంలో, అదనపు షోల విషయంలో ఏపీ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. ఈ విషయంపై తాజాగా ప్రముఖ నిర్మాత KS రామరావు.. RRR సినిమాకు ఏపీ ప్రభుత్వం అందించిన సహకారంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆర్ఆర్ఆర్ సినిమాకు అందించిన సహకారం మర్చిపోలేనిదని రామారావు అన్నారు. ఇదే సమయంలో కర్నూలును సినిమా షూటింగ్ స్పాట్ గా మార్చాలని, ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు పై సినీ పెద్దలు ఆలోచించాలని ఆయన తెలిపారు. మరి.. నిర్మాత కె.ఎస్ రామారావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.