సినీ సెలబ్రెటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తుంటారు ప్రేక్షకులు, అభిమానులు. కానీ.. ఏ విషయమైనా సెలబ్రిటీలు కెమెరా ముందు కనిపిస్తేనే.. వారిచ్చే అప్ డేట్స్ పై ఫ్యాన్స్ కి క్లారిటీ వస్తుంది. సోషల్ మీడియా వచ్చాక తమ ఫ్యామిలీ విషయాలతో పాటు.. హోమ్ టూర్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు సెలబ్రిటీలు.
సాధారణంగా సినీ సెలబ్రెటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తుంటారు ప్రేక్షకులు, అభిమానులు. కానీ.. ఏ విషయమైనా సెలబ్రిటీలు కెమెరా ముందు కనిపిస్తేనే.. వారిచ్చే అప్ డేట్స్ పై ఫ్యాన్స్ కి క్లారిటీ వస్తుంది. అయితే.. కొన్నాళ్లుగా సెలబ్రిటీలంతా అప్ డేట్స్ ఇవ్వడానికి సోషల్ మీడియానే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలుసు కదా! శుభవార్తలైనా, బ్యాడ్ న్యూస్ అయినా అన్నింటికి సోషల్ మీడియానే. ఇంకేముంది సోషల్ మీడియా వచ్చాక తమ ఫ్యామిలీ విషయాలతో పాటు.. హోమ్ టూర్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ కమెడియన్ రఘు కారుమంచి.. హోమ్ టూర్ వీడియో చేసింది సుమన్ టీవీ. ఇతని గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అదుర్స్, లక్ష్మీ, కిక్, నాయక్, ఊసరవెల్లి.. లాంటి హిట్ సినిమాలతో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. 20 ఏళ్ళ క్రితమే ఆది సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన రఘు.. విలన్ గా, కమెడియన్ గా ఎక్కువ సినిమాలు చేశారు. అయితే.. కెరీర్ లో సుమారు 150కి పైగా సినిమాలలో నటించిన రఘు.. ఇన్నేళ్ళలో స్టార్ యాక్టర్ మాత్రం కాలేకపోయాడు. కానీ.. తన ఇల్లు మాత్రం చాలా గ్రాండ్ గా నిర్మించుకున్నాడు. లేటెస్ట్ హోమ్ టూర్ వీడియోలో రఘు ఇల్లు.. వాకిలి.. వంటరూమ్, బాల్కనీ ఇలా అన్నీ.. చాలా లగ్జరీ లెవెల్ లో ఉన్నాయి. చూస్తుంటే.. స్టార్ హీరోల ఇళ్లకు ఏమాత్రం తగ్గకుండా నిర్మించుకున్నాడు.
ప్రస్తుతం రఘు హోమ్ టూర్ వీడియో వైరల్ గా మారింది. కాగా.. ఇండస్ట్రీలో రఘుకి డైరెక్టర్ వివి వినాయక్, సురేందర్ రెడ్డి మంచి స్నేహితులని తెలుస్తోంది. సినిమాల్లోకి రాకముందు నుండే వాళ్ళతో మంచి స్నేహం ఉందట. ఆ స్నేహంతోనే సాఫ్ట్ వేర్ జాబర్ అయిన రఘుని.. నటుడిగా, కమెడియన్ గా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు వినాయక్, సురేందర్ రెడ్డి. ఇదిలా ఉండగా.. రఘుకి భార్యా, ఇద్దరు పిల్లలు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు అడపాదడపా టీవీ ప్రోగ్రామ్స్, ఓటిటి వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ని లీడ్ చేస్తున్నాడు. మరి రఘు హోం టూర్ వీడియో చూసి.. అతని ఇల్లు ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి.