హీరో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్(93) అనారోగ్యంతో బాధ పడుతూ శుక్రవారం మరణించారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతి హీరో రాజశేఖర్ తీవ్ర దుఃఖానికి గురయ్యారు. కాగా గోపాల్ చెన్నైలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. హీరో రాజశేఖర్ ఆయనకు రెండో కుమారుడు. కాగా వరదరాజన్ గోపాల్ అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నట్లు సమాచారం.