టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ జాబితాలో నిలిచారు జీవిత, రాజశేఖర్‌లు. సినిమాల ద్వారా పరిచయం అయిన వీరు.. ఆ తర్వాత ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా ఓ షోకి వచ్చిన వీరు.. తమ ప్రేమ కథ గురించి వివరించారు.
టాలీవుడ్‌లో ఆదర్శ దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు జీవిత-రాజేశేఖర్ దంపతులు. వీరిద్దరూ ఒకేసారి తమ సినీ కెరీర్ ప్రారంభించారు. మొదట్లో ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అలా మొదలైన వారి ప్రేమ.. పెళ్లి పీటలు ఎక్కంది. వారి అన్యోన్య దాంతప్యానికి గుర్తుంగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. ప్రస్తుతం వారిద్దరూ హీరోయిన్స్‌గా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఓ చానెల్‌లో ప్రసార అయ్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. కమెడియన్ వెన్నెల కిషోర్ యాంకర్‌గా చేస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా జీవిత రాజశేఖర్ దంపతులు పాల్గొన్నారు. తమ పాతికేళ్ల వారి ప్రయాణంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ ఆసక్తికర విషయాలు తెలియజేయశారు. కెరీర్ ప్రారంభంలో ఓ సినిమాలో జీవిత, రాజశేఖర్ కలిసి నటిస్తున్నారు. అప్పుడు రాజశేఖర్ నిర్మాత దగ్గరకు వెళ్లి హీరోయిన్ బాగాలేదు మార్చేయండి అన్నారు. కానీ తీరా చూస్తే తర్వాతి రోజు పేపర్లు హీరోని మార్చేస్తున్నట్లు వార్త వచ్చిందట. ఇక జీవిత.. రాజశేఖర్‌ను ప్రేమిస్తుందనే వార్త ముందుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలిసిందట. దాంతో రాఘవేంద్రరావు.. జీవితను పిలిచి, రాజశేఖర్ విలన్‌లా ఉన్నాడు.. నమ్మకు అని ఆమెకు సలహా కూడా ఇచ్చారట. రాజశేఖర్‌లో ఫ్రాంక్ నెస్ తనకు నచ్చిందని, అయితే ఆయనను పెళ్లి చేసుకోవటానికి , ఆ ప్రాసెస్‌లో రాజశేఖర్‌ను ఒప్పించటానికి చాలానే కష్టపడ్డాడనని చెప్పుకొచ్చారు జీవిత.
ఈ క్రమంలో చోటు చేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేసుకుని.. ఎమోషనల్ అయ్యారు జీవిత. ‘‘రాజశేఖర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. అప్పుడు ఆయనకు అంబాసిడర్ కారు ఉండేది. ఓ రోజు డ్రైవింగ్ సీట్లో రాజశేఖర్, పక్క సీట్లో ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూర్చున్నారు. వెనుక సీట్లోనేను కూర్చున్నాను. వారిద్దరిని అలా పక్క పక్కన చూసి చాలా బాధ పడ్డాను.. ఏడ్చేశాను’’ అని చెప్పుకొచ్చారు జీవిత.
రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘అప్పుడు జీవిత.. మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. కానీ నాతోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఆమెలోని ఆ ప్రేమే నాకు నచ్చింది. ఇక తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడానికి జీవిత అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. నన్ను బ్రిడ్జీపై నుంచి తోసేసి.. ఆస్పత్రిలో చేర్పించి.. పక్కనే ఉండి సేవలు చేస్తూ.. మా అమ్మానాన్నల నమ్మకాన్ని గెల్చుకుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరూ మీ ప్రేమ ఏందో అని ఎగతాళి చేస్తుంటారని చెప్పుకొచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.