సినిమాల్లో నటించాలని చాలమందికి ఉండే కోరిక. కొంతమందికి ప్రతిభ ఉన్నా.. అవకాశాలు రాక ఎంతోమంది సినిమా ప్రియులు అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇక కొంతమంది సినిమాల్లో ఏ చిన్న వేశం దొరికిన నటించేందుకు వెనకాడరు. అలాంటి వారి కోసం ఏకంగా టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇస్తుంది చిత్ర యూనిట్.
వరుస సినిమాలతో తన జోరును కొనసాగిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇక ప్రస్తుతం అతను రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలే కాకుండా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తోనూ ఓ సినిమా చేయనున్నాడు ఈ డైనమిక్ హీరో. ఈ నేపథ్యంలోనే ఆ మూవి యూనిట్ ప్రాజెక్ట్-kపేరుతో షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టింది.
అయితే కొత్తవారికి అవకాశమివ్వాలని భావించి చిత్ర యూనిట్ ఫేసస్ ఆఫ్ ద ఫ్యూచర్ పేరుతో తర్వాత వచ్చే సినిమాల్లో నటించేవారి కోసం క్యాస్టింగ్ మొదలు పెట్టింది. దీంతో ఈ నెల 12న బెంగుళూరు, పుదిచ్చేరి, కొచ్చిన్ 15న ఈ క్యాస్టింగ్ ఉంటుందని మూవీ యూనిట్ ఇన్ స్టాలో తెలిపింది. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.