శరవణ స్టోర్స్ సంస్థ అధినేత అరుల్ శరవణన్. శరవణన్ సంస్థకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో ఆయనే హీరో. ఈ వాణిజ్య ప్రకటనల్లో నటించే హీరోయిన్స్, మోడల్స్ మధ్య నుండి నడుచుకుంటూ వస్తూ కనిపించేదీ ఆయనే. ఆ ప్రకటనలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతుంటాయి. అయితే ఆయన హీరోగా మారిన సంగతి విదితమే. ఇప్పుడు ఆయన నుండి మరో అప్ డేట్ రానుంది.
శరవణ స్టోర్స్ యజమాని శరవణన్ అరుల్ అనగానే గుర్తుకు పట్టరు గానీ, తన సంస్థకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో ఆయనే నటిస్తూ హడావుడి చేసే శరవణన్ అనగానే గుర్తు పట్టేస్తుంటారు. ఈ ప్రకటనల్లో బడా హీరోయిన్లు, మోడల్స్ పక్కన ఆయనే హీరో. తన ప్రకటనలకు తానే బ్రాండ్ అంబాసిడర్. చెన్నైలో ఆయన స్టోర్స్ చాలా ఉన్నాయి. ఈ యాడ్స్ ద్వారానే తెలుగు వారికి కూడా పరిచయం. ఇక్కడి వారికి కూడా ఆయన బాగా తెలుసు. ఆ యాడ్స్ తో ఎన్ని విమర్శలు వచ్చినా.. నటిస్తూనే ఉంటారు. అయితే చిన్ననాటి నుండి నటనపై ఉన్న మక్కువతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. లేటు వయసులో హీరోగా నటించి, మెప్పించవచ్చునని నిరూపించారు.
ది లెజెండ్ అంటూ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ ఊర్వశి రౌథాలా నటించింది. అజిత్ హీరోగా నటించిన ఉల్లాసం సినిమాను తెరకెక్కించిన జీడీ జెర్రీ దర్శకత్వం వహించాడు. హ్యారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చారు. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టుకుంది. అయితే ఇప్పుడు ఆయన మరో సినిమాతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కాశ్మీర్ లో జరగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్ డేట్ త్వరలో రానున్నట్లు తమిళ మీడియా చెబుతోంది. కాశ్మీర్ లో ఆయన దిగిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ మారాయి. అయితే ఈ సినిమాకు మరింత బడ్జెట్ పెట్టనున్నట్లు సమాచారం. రూ. 50 కోట్లకు పైగా బడ్జెట్ ఉండనుందని తెలుస్తోంది.
భారత్‌లోనే అతిపెద్ద రిటైల్ సంస్థ శరవణ స్టోర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరవణన్ సెల్వరత్నమ్ కుమారుడే అరుళ్ శరవణన్. 1970 చెన్నైలో జన్మించిన ఆయన చదువు పూర్తి చేశాక.. తండ్రి బాటలోనే వ్యాపారాన్ని చూసుకున్నారు. అయితే ఆ సమయంలో మోడల్ గా కూడా చేశారు. అప్పట్లోనే నటనపై ఆసక్తి ఏర్పడగా.. వ్యాపారంలో బిజీగా మారిపోయారు. తన సంస్థల ప్రకటనల్లో నటించి, తన కోరికను కొంత వరకు తీర్చుకున్నారు. అయితే 50 ఏళ్ల పాటు బిజినెస్ రంగంలోనే ఉండిపోయిన ఆయన.. సినిమాల వైపుకు రావాలని భావించి ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శరవణన్‌కు సూర్యశ్రీతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. సోదరి వివాహానికి రూ.13 కోట్ల విలువైన దుస్తులను బహూకరించి వార్తలో నిలిచారు.