సాధారణంగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మనం ఎప్పటినుంచో కలవాలనుకునే మనిషి, చేయాలనుకునే పని జరిగినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ దీనికి అతీతం కాదు. ఇక సినిమా సెలబ్రిటీలు కూడా చాలా కంపోజ్డ్ గా ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం బరస్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. తమన్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా వారసుడు (తమిళంలో ‘వారిసు’). ఈరోజే తమిళంలో రిలీజ్ చేశారు. కానీ తెలుగు వెర్షన్ మాత్రం జనవరి 14న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన తమన్.. అదరగొట్టేశాడు. రంజితమే, తళపతి సాంగ్స్ తో పాటు మిగిలిన పాటలు కూడా అలరిస్తున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా తమన్ ని మెచ్చుకుంటున్నారు. తనతో పాటు తన ఫ్యామిలీ కూడా విజయ్ కి పెద్ద ఫ్యాన్స్ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు అందరూ ఏదో అనుకోకుండా ఎమోషనల్ అయ్యాడులే అనుకున్నారు.
కానీ తమన్ కి నిజంగా విజయ్ సినిమా చాలా ఎమోషనల్ గా మారినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ట్వీట్ చేసిన తమన్.. ‘విజయ్ అన్నా.. సినిమాలోని ఎమోషన్స్ సీన్స్ చూసి ఏడ్చేశాను. కన్నీరు విలువైంది. వారిసు సినిమా నా హృదయాన్ని హత్తుకుంది. ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. లవ్యూ అన్నా’ అని తమన్ విజయ్ తో తీసుకున్న ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. ఇక అందరి మధ్య థియేటర్లలో మరోసారి ‘వారిసు’ చూసిన కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పక్కనే డైరెక్టర్ వంశీ పైడపల్లి, దిల్ రాజు ఉన్నాసరే ఏడుస్తూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి తమన్ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.